ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐహెచ్ ప్రో హాకీ లీగ్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు మరో ఓటమి

 ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐహెచ్ ప్రో హాకీ లీగ్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు  మరో ఓటమి

హోబర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐహెచ్ ప్రో హాకీ లీగ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా వరుసగా ఐదో  ఓటమి ఎదుర్కొంది. ఆదివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పెనాల్టీ షూటౌట్‌‌‌‌‌‌‌‌లో 5–4తో ఆస్ట్రేలియా చేతిలో పోరాడి ఓడిపోయింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లూ 2–2తో సమంగా నిలిచాయి. 

ఇండియా తరఫున అమిత్ రోహిదాస్ (15వ నిమిషం), జుగ్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ సింగ్ (43వ ని) చెరో గోల్ కొట్టి జట్టును 2–0తో ఆధిక్యంలో నిలిపారు. కానీ, ఆసీస్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోయెల్ రింటాల (47, 56వ ని) 9 నిమిషాల గ్యాప్‌‌‌‌‌‌‌‌లో రెండు గోల్స్ కొట్టి స్కోరు సమం చేశాడు. విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తేల్చేందుకు నిర్వహించిన షూట్‌‌‌‌‌‌‌‌లో  ఆసీస్ విజయం అందుకుంది. మంగళవారం జరిగే తదుపరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో స్పెయిన్‌‌‌‌‌‌‌‌తో ఇండియా పోటీ పడనుంది.