కరోనాతో క్రికెటర్ పియూష్ చావ్లా తండ్రి మృతి 

కరోనాతో క్రికెటర్ పియూష్ చావ్లా తండ్రి మృతి 

భారత క్రికెటర్ పియూష్ చావ్లా కుటుంబంలో విషాదం నెలకొంది. పియూష్ చావ్లా తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా కరోనాతో ఇవాల(సోమవారం) చనిపోయారు. ప్రమోద్ కుమార్ ఇటీవల కరోనా నుంచి కోలుకున్నా ఇతర అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఈ విషయాన్ని పియూష్ చావ్లా స్వయంగా తెలిపారు. తన బలం తన తండ్రేనని.. కానీ ఇవాళ ఆయనను కోల్పోయానని పియూష్ చావ్లా విచారం వ్యక్తం చేశారు.