Women’s World Cup 2025: మహిళల ప్రపంచ కప్‌కు ఇండియా స్క్వాడ్ ప్రకటన.. షెఫాలీపై వేటు.. రేణుక ఠాకూర్‌కు ఛాన్స్

Women’s World Cup 2025: మహిళల ప్రపంచ కప్‌కు ఇండియా స్క్వాడ్ ప్రకటన.. షెఫాలీపై వేటు.. రేణుక ఠాకూర్‌కు ఛాన్స్

మహిళల వన్డే ప్రపంచ కప్ కి భారత స్క్వాడ్ వచ్చేసింది. మంగళవారం (ఆగస్టు 19) ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ మహిళా జట్టు సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ 2025, సెప్టెంబర్ 30 నుంచి 2025 నవంబర్ 2 వరకు జరగనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ టోర్నీ ఐదు వేదికలలో హైబ్రిడ్ మోడ్‎లో జరగనున్నట్లు ఐసీసీ ఇప్పటికే వెల్లడించింది. స్క్వాడ్ విషయానికి వస్తే ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 

భారత స్క్వాడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటర్ షఫాలీ వర్మను జట్టు నుండి తొలగించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. స్మృతి మంధాన,  ప్రతికా రావల్‌ అద్భుతంగా ఆడడంతో సెలెక్టర్లు వారినే కొనసాగించారు. బ్యాకప్ ఓపెనర్ గాను షెఫాలీకి ఛాన్స్ ఇవ్వలేదు. 2024 అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో షెఫాలీ తన చివరి వన్డే ఆడింది. పేలవ ఫామ్ కారణంగా వన్డే జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత షెఫాలీ స్థానంలో వచ్చిన ప్రతికా రావల్‌ నిలకడగా రాణించి జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకుంది. ఈ కారణంగా షెఫాలీకి నిరాశ తప్పలేదు. బ్యాకప్‌ ఓపెనర్ గా సెలక్టర్లు యస్తిక భాటియాను ఎంచుకున్నారు. 

ALSO READ : పాపం అక్షర్.. ఒక్క సిరీస్‎తోనే సరిపెట్టారుగా

వెన్నునొప్పి కారణంగా డిసెంబర్ 2024 నుండి జట్టుకు దూరంగా ఉన్న రేణుకా సింగ్ ఠాకూర్ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. రేణుక తిరిగి రావడంతో భారత జట్టులో ఫాస్ట్ బౌలింగ్  తీరిపోయాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ గా భారత జట్టును నడిపించనుంది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా కొనసాగనుంది. తేజల్ హసబ్నిస్, ప్రేమ రావత్, ప్రియా మిశ్రా, ఉమా చెత్రీ, మిన్ను మణి, సయాలీ సత్ఘరే స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు. వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కు కూడా సెలక్టర్లు స్క్వాడ్ ను ఎంపిక చేశారు. వరల్డ్ కప్ జట్టులో కేవలం ఒక మార్పు మాత్రమే చేసింది. అమంజోత్ కౌర్ స్థానంలో సయాలి సత్ గరే ను ఎంపిక చేశారు. 

2025 మహిళల ప్రపంచ కప్ కోసం భారత జట్టు: 

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (విసి), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, అమంజోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి (వికెట్ కీపర్), యాస్తిక్ భాటియా (వికెట్ కీపర్), స్నేహ రానా 

స్టాండ్ : తేజల్ హసబ్నిస్, ప్రేమ రావత్, ప్రియా మిశ్రా, ఉమా చెత్రీ, మిన్ను మణి, సయాలీ సత్ఘరే

ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు భారత జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (విసి), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, సయాలీ సత్‌ఘరే, రాధా యాదవ్, శ్రీ చరణి (వికెట్ కీపర్), యాస్తిక్ భాటియా (వికెట్ కీపర్), స్నేహ రానా