కొడితే పేలిపోవాలి : భారత్ బ్రహ్మాస్త్రం.. ప్రళయ మిసైల్ రాకెట్లు

కొడితే పేలిపోవాలి : భారత్ బ్రహ్మాస్త్రం.. ప్రళయ మిసైల్ రాకెట్లు

ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి 'ప్రళయ్'ను విజయవంతంగా ప్రయోగించిందని రక్షణ శాఖ వెల్లడించింది.  ఈ క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. ఉదయం 9.50 గంటలకు ప్రయోగించిన ఈ క్షిపణి తన మిషన్ లక్ష్యాలన్నింటిని చేరుకుందని అధికారి ఒకరు తెలిపారు. ఇది 350 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది 500 నుంచి 1000 కిలోల పేలోడ్‌ను తీసుకెళ్తుంది. ప్రళయ్ క్షిపణిని చైనా 'డాంగ్ ఫెంగ్ 12', ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఉపయోగించిన Iskanderతో పోల్చవచ్చని రక్షణ శాఖ తెలిపింది.