
మాంచెస్టర్: ఆల్‌రౌండ్ షోతో చెలరేగిన ఇండియా విమెన్స్ జట్టు.. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 3–1తో సొంతం చేసుకుంది. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 126/7 స్కోరు చేసింది.
సోఫియా డంక్లే (22) టాప్ స్కోరర్. కెప్టెన్ బ్యూమోంట్ (20), అలైస్ క్యాప్సీ (18), పైజ్ స్కోల్‌ఫీల్డ్ (16), ఎకెల్‌స్టోన్ (16 నాటౌట్) మోస్తరుగా ఆడారు.
శ్రీచరణి, రాధా యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఇండియా 17 ఓవర్లలో 127/4 స్కోరు చేసి నెగ్గింది. స్మృతి మంధాన (32), షెఫాలీ వర్మ (31) తొలి వికెట్‌కు 56 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. జెమీమా రొడ్రిగ్స్ (24 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్ (26) మిగతా లాంఛనం పూర్తి చేశారు.