
ఇండియాకు మళ్లీ బ్యాండ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ వచ్చేస్తున్నాయి. 17 ఏళ్ల తర్వాత ఇండియా మళ్లీ ఈ టోర్నమెంట్ ను నిర్వహించబోతోంది. ఈ విషయాన్ని సోమవారం (సెప్టెంబర్ 01) కన్ఫమ్ చేసింది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF). ఢిల్లీలో 2026 ఆగస్టులో జరగనున్నాయి ఈ పోటీలు.
ఇండియాలో బ్యాండ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ 17 ఏళ్ల క్రితం జరిగాయి. హైదరాబాద్ వేదికగా 2009లో నిర్వహించారు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇండియాకు ఈ బిగ్ ఈవెంట్ రాబోతోంది. ఆసియాలో బ్యాండ్మింటన్ ఛాంపియన్ షిప్స్ జరిగి ఇప్పటికీ నాలుగేళ్లు గడుస్తున్నాయి. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆసియాలో జరగుతున్న ఈవెంట్ కావడం గమనార్హం.
ప్యారిస్ ఛాంపియన్షిప్స్ 2025 ముగింపు వేదికలో తదుపరి ఈవెంట్ షెడ్యూల్ ను ప్రకటించారు. BWF ప్రసిడెంట్ కున్యాంగ్ పటామా, ఫ్రాన్స్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ చీఫ్ ఫ్రాంక్ లారెంట్, ఇండియా బ్యాడ్మింటన్ జనరల్ సెక్రెటరీ సంజయ్ మిశ్రా ముగింపు వేడుకలో ఉమ్మడిగా ప్రకటించారు.
ఇండియాలో బ్యాండ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ గ్రాండ్ షో ఉండబోతుందని ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ జనరల్ సెక్రెటరీ సంజయ్ మిశ్రా అన్నారు. గత పదిహేనేళ్లుగా ఇండియా షట్లర్స్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ లో తమ సత్తా చాటుతూ వస్తున్నారు. 2011 నుంచి కనీసం ఒక్క మెడల్ అయినా ఇండియాకు వచ్చేలా ప్రతిభ కనబరుస్తున్నారు. గుత్తా జ్వాలా, అశ్వినీ పొన్నప్ప జంట డబుల్స్ లో మెడల్ తీసుకొచ్చి ఆ సంప్రదాయానిక తెరతీశారు.
ఆ తర్వాత పీవీ సిందూ,సైనా నెహ్వాల్, కిదాంబీ శ్రీకాంత్, చిరాగ్ షెట్టీ, సాత్విక్ సాయిరాజ్ రెడ్డి తదితర ప్లేయర్లు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అయితే 2025 ఛాంపియన్షిప్స్ లో చిరాగ్ షెట్టీ, సాయిరాజ్ రెడ్డీలు క్వార్టర్ ఫైనల్ చేరుకుని బ్రాంజ్ మెడల్ సాధించారు.