భారత్  VS న్యూజిలాండ్: గెలిస్తేనే సెమీస్ కు ఇండియా

భారత్  VS న్యూజిలాండ్: గెలిస్తేనే సెమీస్ కు ఇండియా

భారత్, న్యూజిలాండ్ మధ్య మరో టఫ్ ఫైట్ కు అంతా రెడీ అయ్యింది. ఎల్లుండి ఇరు జట్ల మధ్య టీ-20 మ్యాచ్ జరగనుంది. అయితే టీ-20 వరల్డ్ కప్ లో ఇప్పటికే రెండు జట్లు పాకిస్థాన్ చేతిలో ఓడిపోయాయి. దీంతో సెమీస్ కు అర్హత సాధించాలంటే... ఆదివారం జరిగే మ్యాచ్ లో గెలుపు కీలకంగా మారనుంది. అయితే ఐసీసీ టోర్నీల్లో రెండు దశాబ్దాలుగా టీమ్  ఇండియాకు షాకిస్తోంది కివీస్. 2003 తర్వాత ఐసీసీ నిర్వహించిన ఒక్క టోర్నీలో కూడా న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించలేదు. అయితే న్యూజిలాండ్  ఈసారి కూడా తన విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది. దీంతో తన రికార్డును మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది.

టీమ్  ఇండియా 2003 వన్డే ప్రపంచకప్ లో చివరిసారి గంగూలీ కెప్టెన్సీలో కివీస్ ను ఓడించింది భారత్. మెగా టోర్నీల్లో టీమిండియా అన్ని మేయిన్ టీమ్స్ ను మట్టికరిపించినా... కివీస్ ను మాత్రం ఓడించలేకపోయింది. ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్  ఫైనల్లోనూ కోహ్లీసేన ఓటమిపాలైంది. అయితే పాకిస్థాన్ తో ఓటమితో ఇరు జట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. ఈ మ్యాచ్ లో మనపై కివీస్ గెలిస్తే.. పాక్ తో ఓడింది కాబట్టి.. మిగతా మూడు మ్యాచ్ ల్లో నెగ్గి 8 పాయింట్లు సాధించే ఆస్కారం ఉంది. అప్పుడు పాక్, కివీస్ చెరో 8 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలవగా.. భారత్ మాత్రం 6 పాయింట్లతో సెమీస్  రేసు నుంచి తప్పుకునే ప్రమాదం ఉంది. 

ఇప్పటికే పాక్ చేతిలో ఈ రెండు టీమ్స్ ఓడటంతో... తీవ్ర ఒత్తిడిలో ఉండనున్నాయి. దీంతో ప్రతి అడుగు ఆచూతూచి వేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా టీమ్ ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. పాక్ తో మ్యాచ్ లో ఆరో బౌలర్ లేక టీమ్ ఇబ్బంది పడింది. హార్దిక్ ప్లేస్ లో ఆల్ రౌండర్ శార్దూల్ ను తీసుకునే అవకాశం ఉంది. అటు ఐసీసీ టోర్నోల్లో కివీస్ పై టీమిండియాకు బ్యాడ్ రికార్డ్ ఉండటంతో... భారత్ పై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు