
తెలంగాణ ఎన్నికల పోలింగ్ పై ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీనే అత్యధిక సీట్లలో గెలిపిస్తున్నారని నవంబర్ 30వ తేదీ గురువారం ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. జాతీయ, స్థానిక సర్వే సంస్థలన్నీ దాదాపుగా కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లు వస్తాయని తేల్చిచెప్పాయి. ఆ పార్టీకి ఎన్నికలకు ముంగట ఉన్న వేవ్, పోలింగ్ రోజు కూడా కొనసాగిందని పేర్కొన్నాయి.
మ్యాజిక్ ఫిగర్ (60 సీట్లు)కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని మెజారిటీ సంస్థలు ప్రకటించగా.. 55 నుంచి 60 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని మరికొన్ని సంస్థలు తెలిపాయి. ప్రీపోల్ సర్వేలలో బీఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లు ఇచ్చిన పలు సంస్థలు కూడా.. ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తున్నాయని పేర్కొన్నాయి.
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్:
కాంగ్రెస్ : 63 - 73 సీట్లు
బీఆర్ఎస్: 34-44 సీట్లు
బీజేపీ: 4-8 సీట్లు
ఇతరులు:5-8 సీట్లు
చాణక్య స్టాటజీస్
కాంగ్రెస్: 67-78
బీఆర్ఎస్ 22-31
బీజేపీ : 6- 9
ఇతరులు : 6-7
పీపుల్స్ పల్స్
కాంగ్రెస్: 62-72
బీఆర్ఎస్: 35-46
ఎంఐఎం: 6-7
బీజేపీ : 3-8
ఇతరులు : 1-2
జన్ కీ బాత్
కాంగ్రెస్: 58-64
బీఆర్ఎస్: 46-56
బీజేపీ: 4-9
ఎంఐఎం: 5-7
న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్
కాంగ్రెస్ :56
బీఆర్ఎస్ : 58
బీజేపీ :10
పోల్‌స్ట్రాట్
బీఆర్ఎస్: 48-58
కాంగ్రెస్ : 49-59
బీజేపీ: 5-10
ఎంఐఎం: 6-8
టుడేస్ చాణక్య
కాంగ్రెస్: 71 ( 9 సీట్లు ప్లస్ లేదా మైనస్)
బీఆర్ఎస్: 33 (9 సీట్లు ప్లస్ లేదా మైనస్)
బీజేపీ : 7 (5 సీట్లు ప్లస్ లేదా మైనస్)
ఇతరులు: 8 ( 3 సీట్లు ప్లస్ లేదా మైనస్)
ఆరా ప్రీ పోల్ సర్వే
బీఆర్ఎస్ : 41-49
కాంగ్రెస్: 58-67
బీజేపీ: 5-7
ఇతరులు: 7- 9