తెలుగు, తమిళ సినీ వర్గాల్లో ప్రస్తుతం ఒక భారీ క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ సిద్ధమవుతోందనే బలమైన టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ 2026 రెండో అర్ధభాగంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #AA22xA6 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమాకు కమిట్ అవుతారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో కళ్ళు చెదిరే భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని టాక్.
లోకేష్ అప్డేట్
లోకేష్ ఇప్పటికే తన కథను అల్లు అర్జున్‌కు వినిపించాడని, ఆ ఐడియా బన్నీకి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ప్రస్తుతం లోకేష్, స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉండగా, త్వరలో మరోసారి అల్లు అర్జున్‌కు కథను వినిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కథ ప్రత్యేకత
ఈ సినిమా 1962లో ప్రచురితమైన DC కామిక్స్ నవెల్ “The Steel Claw” ఆధారంగా ఉంటుందని టాక్. కథ ప్రకారం, ఒక వ్యక్తి ప్రమాదంలో తన కుడి చేయిని కోల్పోతాడు. ఆ తరువాత అతనికి ఉక్కుతో తయారైన కృత్రిమ చెయ్యి (స్టీల్ ప్రోస్థెసిస్) అమర్చబడుతుంది. ఒక ఎలక్ట్రిక్ షాక్ తర్వాత అతడు తన శరీరాన్ని మొత్తం కనబడకుండా చేయగలిగే శక్తిని పొందుతాడు. కానీ ఆ ఉక్కు చేయి మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. ఇదే కథకు ప్రధాన ఆకర్షణగా చెప్పుకుంటున్నారు. DC కామిక్స్ ఆధారంగానే మూవీ వస్తే.. ఇక అల్లు అర్జున్ పాన్ వరల్డ్ సూపర్ హీరోగా మారే ఛాన్స్ ఉంది.
లోకేష్ కనగరాజ్ రెమ్యునరేషన్
ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్‌కు రూ.75 కోట్ల రిమ్యూనరేషన్ ఆఫర్ చేశారని సమాచారం. ఇది ఆయన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం. గతంలో ‘కూలీ’ సినిమాకు లోకేష్ రూ.50 కోట్లు తీసుకున్నారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గతంలో ‘కూలీ’ సినిమాకు లోకేష్ రూ.50 కోట్లు తీసుకున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
►ALSO READ | Nari Nari Naduma Murari: శర్వానంద్ సంక్రాంతి ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు.. నారీ నారీ నడుమ నవ్వులు గ్యారెంటీ!”
ఇదిలా ఉండగా, లోకేష్ ముందుగా చేయాల్సిన ‘ఖైదీ 2’ని పక్కనబెట్టి అల్లు అర్జున్ సినిమాను ఎంచుకోవడానికి కారణం కూడా ఇదేనని టాక్. ఖైదీ2కి మేకర్స్ తక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతోనే, ఈ సూపర్ హీరో ప్రాజెక్ట్ వైపు లోకేష్ షిఫ్ట్ అయ్యారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఏదేమైనా, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే నెలలో వెలువడే అవకాశం ఉందని సమాచారం.
DC కామిక్స్ (DC Comics): అనేది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు అతిపెద్ద అమెరికన్ కామిక్ పుస్తక ప్రచురణ సంస్థలలో ఒకటి. ఈ సంస్థే సూపర్‌మ్యాన్, బాట్‌మ్యాన్, వండర్ వుమన్, ఫ్లాష్ వంటి ప్రపంచ ప్రసిద్ధ సూపర్ హీరో పాత్రలను క్రియేట్ చేసింది. మార్వెల్ కామిక్స్‌తో పాటు, DC కామిక్స్ కూడా సూపర్ హీరో యూనివర్స్‌లో అగ్రస్థానంలో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న ఈ బ్రాండ్, కామిక్స్, సినిమాలు, టీవీ సిరీస్‌లు మరియు యానిమేషన్ రూపంలో తన ప్రభావాన్ని విస్తరించింది. “DC” అనే పేరు మొదట “డిటెక్టివ్ కామిక్స్” (Detective Comics) అనే టైటిల్‌కు సంక్షిప్త రూపం. తరువాత అదే సంస్థ పేరుగా స్థిరపడింది.
