
న్యూఢిల్లీ: ఇండియా టాప్ అథ్లెట్ ఐశ్వర్య మిశ్రా గతేడాది బ్యాంకాంక్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్స్‌లో నెగ్గిన 400 మీటర్ల ఈవెంట్ బ్రాంజ్ మెడల్ సిల్వర్‌గా అప్‌గ్రేడ్ అయింది. ఆ టోర్నీలో రెండో ప్లేస్‌తో సిల్వర్ నెగ్గిన ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఫరిదా సొలియెవా డోప్ టెస్టులో ఫెయిలైంది. టోర్నీ సందర్భంగా గతేడాది జులై 13న ఆమె నుంచి సేకరించిన శాంపిల్‌లో నిషేధిత మెల్డోనియం ఉన్నట్టు తేలింది. ఆ తేదీ నుంచి ఇప్పటిదాకా ఆమె నెగ్గిన ఫలితాలన్నింటినీ రద్దు చేశారు. దాంతో ఆసియా చాంపియన్‌షిప్స్ సిల్వర్ కోల్పోగా.. బ్రాంజ్ నెగ్గిన ఐశ్వర్య ఖాతాలో సిల్వర్ చేరనుంది.