ప్రపంచ యోగా పోటీల్లో భారత్‌‌ టాప్

ప్రపంచ యోగా పోటీల్లో భారత్‌‌ టాప్

అహ్మదాబాద్: ప్రపంచ యోగా చాంపియన్‌‌షిప్‌‌లో ఆతిథ్య భారత్ 40 స్వర్ణాలు, 8 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 50 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టోర్నమెంట్ ముగింపు దశకు చేరిన వేళ భారత్ తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. 

పతకాల పట్టికలో 3 స్వర్ణాలతో జపాన్ రెండో స్థానంలో, 2 స్వర్ణాలతో సింగపూర్ మూడో స్థానంలో ఉన్నాయి. గుజరాత్‌‌లోని భుజ్ ప్రాంతానికి చెందిన హీనా రాజ్‌‌గోర్ సీనియర్ బి మహిళల 'ఫార్వర్డ్ బెండ్' పోటీలో 43.50 పాయింట్లతో అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 

ఒమన్‌‌కు చెందిన ప్రీతి జైమని రజతం సాధించగా, రష్యా, జోర్డాన్ క్రీడాకారులు కాంస్యం పంచుకున్నారు.