న్యూఢిల్లీ: ఇండియా వాణిజ్య లోటు(దిగుమతులు మైనస్ ఎగుమతులు) ఈ ఏడాది జులై–సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2)లో తగ్గడంతో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (సీఏడీ) కూడా 12.3 బిలియన్ డాలర్లు లేదా జీడీపీలో 1.3 శాతానికి దిగొచ్చింది. ఒక దేశం విదేశీ లావాదేవీల కోసం చేసే ఖర్చు, వచ్చిన ఆదాయం కంటే ఎక్కువగా ఉంటే దాన్ని సీఏడీ అంటారు.
కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో సీఏడీ 20.8 బిలియన్ డాలర్లు లేదా జీడీపీలో 2.2 శాతంగా నమోదైంది. జూన్ క్వార్టర్ (క్యూ1)లో 2.4 బిలియన్ డాలర్లు లేదా జీడీపీలో 0.2 శాతం ఉంది. ఇండియా వస్తువుల వాణిజ్య లోటు క్యూ2లో 87.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
