
న్యూఢిల్లీ : వరల్డ్ యూత్ బ్రిడ్జ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా అండర్–-31 జట్టు బ్రాంజ్ మెడల్ సాధించింది. అండర్-16 జట్టు నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో పతకం కోల్పోయింది.
ఇటలీలోని సాల్సొమగ్గియోర్ లో గురువారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో ఇండియా అండర్–-31 టీమ్ ‘బోర్డ్ ఎ ఈవెంట్’లో ఆడి మొత్తం 24 జట్లలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. అండర్-16 టీమ్ సెమీ-ఫైనల్లో ఫ్రాన్స్‌తో తలపడి ఓడిపోయినా, ఈ టోర్నమెంట్‌లో ఇంత దూరం వెళ్లిన మొదటి ఇండియా తొలి టీమ్‌గా రికార్డు సృష్టించింది.అండర్-–21, అండర్–-26 జట్లు టాప్ –8లోకి రాలేకపోయాయి.