అఫ్గాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే స్వదేశానికి వెళ్ళండి

V6 Velugu Posted on Aug 10, 2021

అఫ్గనిస్తాన్ లోని భారతీయులు  త్వరగా తమ దేశానికి వెళ్లిపోవాలని  భారత రాయబార కార్యాలయం ఆదేశించింది. కొన్ని రోజులుగా తాలిబాన్లకు, ఆ దేశ బలగాలకు మధ్య  హింసాత్మక పోరు జరుగుతోంది. తాజాగా బాల్ఖ్‌ ప్రావీన్స్‌లోని మజార్‌- ఏ- షరీఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తాలిబాన్లు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన భారత రాయబార కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న భారతీయులను వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని సూచించింది. 

మజార్‌- ఏ- షరీఫ్‌ అఫ్గాన్‌లోని నాలుగో పెద్ద నగరం. మజార్ -ఇ -షరీఫ్ నుండి  ప్రత్యేక విమానంలో మంగళవారం ఆఫ్ఘనిస్తాన్ నుండి బయలుదేరాలని  కోరింది. ‘మజార్-ఇ-షరీఫ్ నుండి న్యూఢిల్లీకి ఒక ప్రత్యేక విమానం బయలుదేరుతోంది. మజార్-ఇ-షరీఫ్,  చుట్టుపక్కల ఉన్న భారతీయులు ఈరోజు సాయంత్రం ఆలస్యంగా బయలుదేరే ప్రత్యేక విమానంలో భారతదేశానికి బయలుదేరాలి‘ అని మజార్‌లోని భారతీయ కాన్సులేట్ -ఈ-షరీఫ్ ట్వీట్ చేశారు.

 

Tagged nationals, India Urges, Leave Afghan, Commercial Flights Stop, Mazar-i-Sharif

Latest Videos

Subscribe Now

More News