ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్కు  వ్యతిరేకంగా భారత్ ఓటు

ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్కు  వ్యతిరేకంగా భారత్ ఓటు

ఐక్యరాజ్య సమితి తీర్మానంలో తూర్పు జెరూసలేంతోపాటు ఆక్రమిత పాలస్తీనా భూభాగం, ఆక్రమిత సిరియన్ గోలన్ లో ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది. అమెరికా, కెనడా, హంగేరీ, ఇజ్రాయెల్, మార్షల్ ఐలాండ్స్, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా, నౌరు సహా ఏడు దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించగా, 18 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. 

బంగ్లాదేశ్, భూటాన్, చైనా, ఫ్రాన్స్, జపాన్, మలేషియా, మాల్దీవులు, రష్యా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, యూకెతోపాటు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన 145 దేశాలతోపాటు భారత్ కూడా ఉంది. తూర్పు జెరూసలేంతో సహా ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఆక్రమిత సిరియన్ గోలన్ లో సెటిల్ మెంట్ కార్యకలాపాలు, భూఆక్రమణ, జీవనోపాధి అంతరాయం, పౌరుల బలవంతపు బదిలీ, విలీనానికి సంబంధించిన కార్యకలాపాలను ఈ తీర్మానంలో ఖండించారు. 

ఈ తీర్మానం తూర్పు జెరూసలేం తోపాటు ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఆక్రమిత సిరియన్ గోలన్ లో ఇజ్రాయెల్ నివాసాలు చట్ట విరుద్ధమైన, శాంతి, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవరోధమని స్పష్టం చేశారు. వెంటనే ఇజ్రాయెల్ చర్యలను పూర్తిగా నిలిపివేయాలని ఈ తీర్మానం పునరుద్ఘాటించింది.