IND vs AUS: రేపే ఆస్ట్రేలియా, ఇండియా రెండో వన్డే.. వర్షం పడుతుందా..? పిచ్ రిపోర్ట్ ఇదే!

IND vs AUS: రేపే ఆస్ట్రేలియా, ఇండియా రెండో వన్డే.. వర్షం పడుతుందా..? పిచ్ రిపోర్ట్ ఇదే!

ఆస్ట్రేలియా, ఇండియా జట్ల మధ్య గురువారం (అక్టోబర్ 23) అడిలైడ్ వేదికగా రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో చేసిన తప్పుల నుంచి పాఠం నేర్చుకొని రెండో వన్డేలో ఎలాగైనా ఆతిధ్య ఆసీస్ జట్టుకు షాక్ ఇవ్వాలని ఇండియా భావిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో భారత ఆటగాళ్లు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. తొలి వన్డేలో రోహిత్, కోహ్లీ తో పాటు గిల్, అయ్యర్ కూడా విఫలమయ్యారు. ఇదంతా పక్కన పెడితే తొలి వన్డేలో వర్షం కారణంగా ఫ్యాన్స్ మ్యాచ్ ను పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయారు. కేవలం 26 ఓవర్ల మ్యాచ్ మాత్రమే సాగడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

 10 శాతం కంటే తక్కువగా వర్షాలు:
 
రిపోర్ట్స్ ప్రకారం రెండో వన్డేకు కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అడిలైడ్ ఓవల్‌లో గత రెండు రోజుల పాటు వర్షాలు పడ్డాయి. అయితే మ్యాచ్ రోజు మాత్రం వర్షం ముప్పు ఉండదని రిపోర్ట్స్ చెబుతున్నాయి. గురువారం వర్షం పడే అవకాశం 10 శాతం కంటే తక్కువగా ఉంది. రోజంతా కొంచెం మేఘావృతం ఉంటుంది. ఈ మ్యాచ్ కు భారీ వర్షం పడకపోయినా చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ భారీ వర్షం పడితే ఓవర్లను కుదిస్తారు. రోజంతా మ్యాచ్ జరగడం సాధ్యం కాకపోతే మ్యాచ్ ను రద్దు చేస్తారు. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

అడిలైడ్ ఓవల్ పిచ్ రిపోర్ట్:

అడిలైడ్ ఓవల్‌లోని పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామం. పెర్త్ లో లాగ బౌన్సీ వికెట్ ఇక్కడ ఉండదు. వికెట్ ఫ్లాట్ గా ఉంటుంది. బ్యాటర్లు పరుగుల వరద పారించవచ్చు. అయితే ఈ పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించే అవకాశాలు ఉన్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇండియాలో స్పిన్నర్లు ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. 


వన్డే సిరీస్ కు ఇండియా స్క్వాడ్: 

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ 

ఇండియాతో వన్డే సిరీస్ కు ఆస్ట్రేలియా జట్టు:

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లాబుస్చాగ్నే, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా