
రాజ్ కోట్: 3 వన్డేల సిరిస్ లో భాగంగా రాజ్ కోట్ వేదికగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెకండ్ వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ చేశాడు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న టీమిండియాకు మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఫాస్ట్ గా ఆడుతూ రాణించారు. ఈ క్రమంలోనే పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా భారత్ 55 రన్స్ చేసింది. తర్వాత 14వ ఓవర్ లో రోహిత్(42) ఓట్ అయినప్పటికీ గబ్బర్ రాణిస్తున్నాడు.
అతడికి తోడు మూడో వికెట్ గా వచ్చిన కోహ్లీ ఆచితూచి ఆడుతూ ..ఇన్నింగ్స్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ హిట్టింగ్ చాలా అవసరం. ఫస్ట్ వన్డేలో ఘోరంగా ఓడిన భారత్.. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలబెట్టుకోవాలంటే బిగ్ స్కోర్ తప్పనిసరి. 22 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 131/1. ధావన్(55), కోహ్లీ(24) రన్స్ తో క్రీజులో ఉన్నారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపాకు వికెట్ దక్కింది.
FIFTY!
Back to back half-centuries for @SDhawan25, his 29th in ODIs ??
Live – https://t.co/v6DBzYGolk #INDvAUS pic.twitter.com/Ka81gHnnDd
— BCCI (@BCCI) January 17, 2020