ఇండియా తరఫున ఎక్కువ టీ20లు ఆడిన క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. బంగ్లాతో టీ20 అతనికి 99వ మ్యా చ్ . 98 మ్యాచ్ లతో ఇప్పటిదాకా భారత్ తరపున టాప్ ప్లేస్ లో ఉన్న ధోనీని వెనక్కునెట్టి రోహిత్ టాప్ ప్లేస్ షాహిద్ ఆఫ్రిది(99)తో సమానంగా ఉన్నాడు. 111 టీ20 మ్యాచులు ఆడిన షోయబ్ మాలిక్ అందరికంటే ముందున్నాడు. అలాగే, ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా కోహ్లీని కూడా హిట్‌మ్యాన్ అధిగమించాడు. నిన్న 9 రన్స్ చేయడంతో ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 2452 రన్స్ ఉండగా..కోహ్లీ 2450 రన్స్ తో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు.
