క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌పై గురి..నేడు ఐర్లాండ్‌‌‌‌తో ఇండియా మూడో టీ20

క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌పై గురి..నేడు ఐర్లాండ్‌‌‌‌తో ఇండియా మూడో టీ20

డబ్లిన్‌‌‌‌: ఐర్లాండ్‌‌‌‌తో టీ20 సిరీస్‌‌‌‌ను సొంతం చేసుకున్న ఇండియా యంగ్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఇప్పుడు ఆసియా గేమ్స్‌‌‌‌పై దృష్టి పెట్టింది. టీమ్‌‌‌‌లోకి వచ్చిన కుర్రాళ్లు తొలి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో సత్తా చాటడంతో ఇప్పుడు రిజర్వ్‌‌‌‌లో ఉన్న ప్లేయర్లకు చాన్స్‌‌‌‌ ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఐర్లాండ్‌‌‌‌తో జరిగే మూడో టీ20లో పలు మార్పులు చేయాలని టీమిండియా మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్లాన్స్‌‌‌‌ వేస్తోంది. ఈ మ్యాచ్‌‌‌‌లో గెలిచి అటు సిరీస్‌‌‌‌ను క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేయడంతో పాటు ఇటు ఆసియా గేమ్స్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌ను ఖరారు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు సొంతగడ్డపై సిరీస్‌‌‌‌ను చేజార్చుకున్న ఐర్లాండ్‌‌‌‌ కనీసం ఈ మ్యాచ్‌‌‌‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. 

బుమ్రాకు రెస్ట్‌‌‌‌ ఇస్తారా?

నామమాత్రమైన ఈ మ్యాచ్‌‌‌‌ కోసం టీమిండియా తుది జట్టును మార్చే అవకాశం ఉంది. బ్యాక్‌‌‌‌ ఇంజ్యురీ నుంచి కోలుకుని వచ్చిన స్పీడ్‌‌‌‌స్టర్‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌ బుమ్రా, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ ప్లేస్‌‌‌‌లో, ఆవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ ఇవ్వాలని చూస్తున్నారు. అయితే ఆసియా కప్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం బుమ్రా, ప్రసిధ్‌‌‌‌ను కంటిన్యూ చేయొచ్చు. కానీ ఒక్క మ్యాచ్‌‌‌‌ కూడా ఆడకుండా ఆవేశ్‌‌‌‌, జితేశ్‌‌‌‌ను డైరెక్ట్‌‌‌‌గా ఆసియా గేమ్స్‌‌‌‌లో బరిలోకి దించితే సమస్యలు వస్తాయని తాత్కాలిక కోచ్‌‌‌‌ సితాన్షు కొటక్‌‌‌‌ భావిస్తున్నాడు. అందుకే ఈ మ్యాచ్‌‌‌‌లో ఒక్కరికైనా చాన్స్‌‌‌‌ ఇవ్వాలని చూస్తున్నాడు. బ్యాటింగ్‌‌‌‌లో పెద్దగా మార్పులు చేసే చాన్స్‌‌‌‌ లేదు. ఒకవేళ సంజూ శాంసన్‌‌‌‌కు రెస్ట్ ఇవ్వాలనుకుంటే అతని ప్లేస్‌‌‌‌లో జితేశ్‌‌‌‌ శర్మను ట్రై చేయొచ్చు. అయితే ఈ టీమ్‌‌‌‌లో సీనియర్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా ఉన్న శాంసన్‌‌‌‌.. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ టీమ్‌‌‌‌లో చోటుపై గురిపెట్టాడు. గత ఏడు మ్యాచ్‌‌‌‌ల్లో వరుసగా ఫెయిలైన అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో ముకేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌కు ఓ చాన్స్‌‌‌‌ ఇవ్వాలన్న ప్లాన్‌‌‌‌ కూడా ఉంది. టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో యశస్వి, రుతురాజ్‌‌‌‌, తిలక్‌‌‌‌, రింకూ సింగ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లకు ఢోకా లేదు. బిష్ణోయ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో షాబాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ను తీసుకుంటారేమో చూడాలి. 

నో ఛేంజ్‌‌‌‌

ఈ మ్యాచ్‌‌‌‌ కోసం ఐర్లాండ్‌‌‌‌ తమ ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లో భారీ మార్పులు చేయడం లేదు. ఇప్పటికే రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఓడిన హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఈ పోరులో భారీ స్కోరు చేయాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. బ్యాటింగ్‌‌‌‌లో రాస్‌‌‌‌ అడైర్‌‌‌‌, గ్యారెత్‌‌‌‌ డెలానీతో పాటు కొత్తగా లెఫ్టార్మ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ థియో వాన్‌‌‌‌ వోర్కోమ్‌‌‌‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఓపెనింగ్‌‌‌‌లో ఆండీ బాల్బిర్ని రాణిస్తున్నా... టకెర్‌‌‌‌, టెక్టర్‌‌‌‌, స్టిర్లింగ్‌‌‌‌ వైఫల్యం టీమ్‌‌‌‌ను వెంటాడుతున్నది. మిడిలార్డర్‌‌‌‌లో క్యాంపెర్‌‌‌‌ మార్క్‌‌‌‌ అడైర్‌‌‌‌ చెలరేగితే భారీ స్కోరును ఆశించొచ్చు. మెకార్తీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. బౌలింగ్‌‌‌‌లో జోష్‌‌‌‌ లిటిల్‌‌‌‌, బెన్‌‌‌‌ వైట్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ అంచనాలను అందుకోలేకపోతున్నారు.