ఇవాళ భారత్ – న్యూజిలాండ్ మధ్య తొలి టీ20

ఇవాళ భారత్ – న్యూజిలాండ్ మధ్య తొలి టీ20

ఇవాళ్టి నుంచి భారత్ – న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు వెల్లింగ్టన్ వేదికగా తొలి టీ-20 మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్  వంటి సీనియర్లు లేకుండానే భారత జట్టు న్యూజిలాండ్ తో తలపడనుంది. భారత జట్టుకు ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు.

టీ20 ప్రపంచకప్ లో తమ జట్టు ప్రదర్శన నిరాశపర్చినా.. తప్పులను సరిచేసుకుంటూ ముందుకు సాగుతామని హార్థిక్ పాండ్యా తెలిపారు. టీ20 వైఫల్యాల నుంచి బయటపడి తదుపరి టార్గెట్ పై ఫోకస్ చేస్తామన్నారు. తొలి రోజు ప్రాక్టీస్ సెషన్లో స్టాండింగ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొన్నారు. టీ20 మ్యాచ్లు పూర్తి స్వేచ్ఛగా ఆడితేనే విజయం సాధిస్తారని అన్నారు. ప్రతి ప్లేయర్ జట్టు పరిస్థితులను అంచనా వేయడం చాలా ముఖ్యమని చెప్పారు.

ఈ నెల 20న రెండో టీ20, 22న మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇక భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ఈ నెల 25 నుంచి జరగనుంది. ఈ నెల 25న మొదటి వన్డే, 27న రెండో వన్డే, 30న మూడో వన్డే జరగనున్నాయి.