
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ ఎప్పడూ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ అంటే ఆ కిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పైకి ఫ్యాన్స్ కు ఆదివారం (సెప్టెంబర్ 28) అందనుంది. 41 ఏళ్ళ ఆసియా కప్ చరిత్రలో ఇండియా- పాకిస్థాన్ జట్లు తొలిసారి ఫైనల్ కు చేరడంతో ఈ మ్యాచ్ చూసేందుకు ఇరు దేశాల ఫ్యాన్స్ తో పాటు యావత్ ప్రపంచ క్రికెట్ ఎంతో ఆతృత్తగా ఎదురు చూస్తుంది. ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రత్యక్ష ప్రసారమవుతుంది.
ఇండియా-పాకిస్థాన్ మధ్య కప్ ఫైనల్ లైవ్.. ఫ్రీ గా ఎక్కడ చూడాలంటే..?
ఆసియా కప్ లైవ్ మ్యాచ్ ను టీవీల్లో డీడీ స్పోర్ట్స్‌లో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఆసియా కప్ లైవ్ టెలికాస్ట్ ఇండియాలోని సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. సోనీ లైవ్ ఆప్ లో లైవ్ స్ట్రీమింగ్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది. సోనీ స్పోర్ట్స్ టెన్ 1, సోనీ స్పోర్ట్స్ టెన్ 1 HD, సోనీ స్పోర్ట్స్ టెన్ 5, సోనీ స్పోర్ట్స్ టెన్ 5 HD TV లలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. వీటితో పాటు సోనీ స్పోర్ట్స్ టెన్ 3 (హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 3 HD (హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 4 (తమిళం, తెలుగు) టీవీ ఛానెల్‌లలో మ్యాచ్ లైవ్ చూడొచ్చు.
మార్పులు లేకుండానే ప్లేయింగ్ 11:
పాక్ తో జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రెస్ట్ తీసుకున్న శివమ్ దూబే, జస్ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి రానున్నారు. హార్దిక్ పాండ్య ఆడతాడా లేదా అనే అనుమానాలు నెలకొన్నప్పటికీ ఈ ఆల్ రౌండర్ గాయం తీవ్రత పెద్దది కాకపోవడంతో ఫైనల్లో బరిలోకి దిగనున్నాడు. అభిషేక్ శర్మ, శుభమాన్ గిల్ ఓపెనింగ్ చేయనున్నారు. ఆ తర్వాత వరుసగా సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్ బరిలోకి దిగుతారు. ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, అక్షర్ పటేల్ వరుసగా 6,7,8 స్థానాల్లో బ్యాటింగ్ కు వస్తారు. బుమ్రా స్పెషలిస్ట్ పేసర్ గా.. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఆడతారు.
ఇండియా ప్లేయింగ్ 11:
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
పాకిస్థాన్ ప్లేయింగ్ 11:
సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా (కెప్టెన్), హుస్సేన్ తలాత్, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.