Asia Cup 2025: టీమిండియాకు అగ్ని పరీక్ష.. ఐదుగురు స్పిన్నర్లతో పాకిస్థాన్

Asia Cup 2025: టీమిండియాకు అగ్ని పరీక్ష.. ఐదుగురు స్పిన్నర్లతో పాకిస్థాన్

ఆసియా కప్ లో ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ కు మరో కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. ఆదివారం (సెప్టెంబర్ 14) దాయాది జట్టుతో తలపడే ఈ మ్యాచ్ లో టీమిండియా క్లియర్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. లీగ్ మ్యాచ్ లో ఇరు జట్లు ఇప్పటికే భారీ విజయాలతో ఈ మ్యాచ్ లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. యూఏఈపై ఇండియా 93 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకోగా.. మరోవైపు ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 93 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు దాదాపు సూపర్-4 బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంటుంది. 

మ్యాచ్ కు ముందు ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఆసక్తికరంగా మారింది. రెండు జట్లు కూడా తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. మొదటి మ్యాచ్ లో పాక్ ఏకంగా ఐద్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ల  సుఫియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముఖీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అబ్రార్ అహ్మద్, మహమ్మద్ నవాజ్ ఉన్నారు. వీరి ముగ్గురితో పాటు కెప్టెన్ సల్మాన్ అఘా, సైమ్ అయూబ్ స్పిన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా పాకిస్థాన్ జట్టులో షహీన్ అఫ్రిది మాత్రమే స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ గా బరిలోకి దిగనున్నాడు. అతనితో పాటు ఆల్ రౌండర్ ఫహీన్ అష్రఫ్ పేస్ పాక్ కు కలిసి రానుంది. 

ఫాస్ట్ బౌలింగ్ తో పోలిస్తే స్పిన్ ఆడడం టీమిండియాకు కాస్త బలహీనం. ఒకవేళ పాక్ స్పిన్నర్లు తన స్పిన్ ఉచ్చులో మన బ్యాటర్లను పడేస్తే దాయాది జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాకిస్థాన్ తో ఇండియా జట్టులోనూ టాప్ స్పిన్నర్లు ఉన్నారు. చైనా మన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ రూపంలో స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. ఓవల్ గా దుబాయ్ గ్రౌండ్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైనప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పెద్దగా అంచనాల్లేవు. జట్టు మొత్తంలో ప్రత్యేకంగా పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాహిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్రిది గురించి మాత్రమే మాట్లాడొచ్చు. 2021లో ఈ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షాహిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ, విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీని ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఇప్పుడు ఈ ముగ్గురు లేరు కాబట్టి టీమిండియా యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. షాహిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలా ఆడతారన్నది చూడాలి. అయితే మోకాలి సర్జరీ తర్వాత షాహిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మునుపటి  పదును కనిపించడం లేదు. 

ఇండియా:

సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ, శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తిలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్మ, సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శివమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూబే, హార్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండ్యా, అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి, బుమ్రా

పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:

సల్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆగా (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), షాహిబ్జాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫర్హాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహ్మద్​ హారిస్, హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫహీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అష్రఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షాహిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా ఆఫ్రిది, సుఫియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముఖీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అబ్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌