భారత్, విండీస్ మధ్య వందో టెస్ట్.. స్టార్ బౌలర్ అరంగేట్రం

భారత్, విండీస్ మధ్య వందో టెస్ట్.. స్టార్ బౌలర్ అరంగేట్రం

టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు మొదలైంది.  ట్రినిడాడ్ క్వీన్స్ పార్క ఓవ‌ల్ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ టెస్టులో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్ చేస్తోంది. 

భారత్- వెస్టిండీస్ క్రికెట్ చరిత్రలో ఇది వందో టెస్టు కావడం విశేషం.  తొలిసారిగా భారత్ వెస్టిండీస్ జట్లు1948 సిరీస్ లో తలపడ్డాయి. అప్పటి నుంచి  75 ఏండ్లుగా రెండుజట్లూ క్రమం తప్పకుండా ద్వైపాక్షిక సిరీస్ లో తలపడుతూ వస్తున్నాయి.

ఇక ఈ మ్యాచ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది 500వ అంత‌ర్జాతీయ మ్యాచ్. మరోవైపు ఈ టెస్టుతో ఐపీఎల్ స్టార్ ముకేశ్ కుమార్  ఆరంగేట్రం చేశాడు. 

టీమిండియా తుది జట్టు:  య‌శ‌స్వీ జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), గిల్, కోహ్లీ, ర‌హానే, ఇషాన్ కిష‌న్‌(వికెట్ కీప‌ర్‌), జ‌డేజా, అశ్విన్, జ‌య‌దేవ్ ఉనద్కట్, ముకేశ్ కుమార్, సిరాజ్‌.

వెస్టిండీస్ తుది జ‌ట్టు : క్రెగ్ బ్రాత్‌వైట్‌(కెప్టెన్),  చంద‌ర్‌పాల్, కిర్క్ మెకంజీ,  బ్లాక్‌వుడ్, అలిక్ అథ‌న‌జే, జోషువా డ సిల్వా(వికెట్ కీప‌ర్), జేస‌న్ హోల్డర్, అల్జారీ జోసెఫ్‌, కీమ‌ర్ రోచ్, జొమెల్ వార్రిక‌న్, ష‌నాన్ గాబ్రియెల్.