మరికొన్నేండ్లలో ప్రపంచంలో టాప్​ 3 ఎకానమీగా భారత్

మరికొన్నేండ్లలో ప్రపంచంలో  టాప్​ 3 ఎకానమీగా భారత్
  •  వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ లో ప్రధాని మోదీ 
  • ఇంకో 25 ఏండ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా
  • 100కుపైగా దేశాల ప్రతినిధులు హాజరు 

ఇండియా ఇంకో 25 ఏండ్లలో అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, ఇదే లక్ష్యంతో తాము పని చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘పదేండ్ల కిందట ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 11వ ప్లేస్ లో ఉన్న ఇండియా.. ఇప్పుడు ఐదో ప్లేస్ కు చేరుకుంది. మరికొన్నేండ్లలోనే ఇండియా ఎకానమీ థర్డ్ ప్లేస్ కు చేరుకుంటుంది. ఇది నా గ్యారెంటీ” అని ఆయన ప్రకటించారు. బుధవారం గుజరాత్ లోని గాంధీనగర్ లో మూడు రోజుల ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్’ 10వ ఎడిషన్ ను మోదీ ప్రారంభించారు. సమిట్ లో 34 భాగస్వామ్య దేశాలు,130 దేశాల ప్రతినిధులు, ఇండస్ట్రియలిస్టులు పాల్గొన్నారు. 

 ఇంకొనేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదుగుతుందని, ఇది తన గ్యారెంటీ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పదేళ్ల కిందట 11 వ ప్లేస్‌‌లో ఉండేదని అన్నారు.   ఫైనాన్షియల్ సంస్థలన్నీ ఇలాంటి అంచనాలే వేస్తున్నాయని చెప్పారు.  ప్రస్తుతం గ్లోబల్ పరిస్థితులు బాగోలేకపోయినా  ఇలాంటి టైమ్‌‌లోనూ ఇండియా ఎకానమీ స్ట్రాంగ్‌‌గా ఉందని, దీనికి కారణం గత పదేళ్లుగా తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలేనని వివరించారు. ఇంకో 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా  ఇండియా మారుతుందని, ఇందుకోసం పనిచేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. 

ఇది మనకు అమృత్‌‌ కాలమని చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే ‘వైబ్రంట్‌‌ గుజరాత్‌‌ గ్లోబల్‌‌  సమ్మిట్‌‌’ 10 వ ఎడిషన్‌‌ను బుధవారం గాంధీనగర్‌‌‌‌లో ఆయన ప్రారంభించారు. ఈ ఈవెంట్‌‌లో 34 భాగస్వామ్య దేశాలు,  130 దేశాల ప్రతినిధులు, వివిధ ఇండస్ట్రియలిస్టులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి తాజాగా  75 ఏళ్లు పూర్తయ్యిందని, రానున్న 25 ఏళ్ల కోసం ఇండియా పనిచేస్తోందని మోదీ అన్నారు. 100 వ ఇండిపెండెన్స్‌‌ డే నాటికి  అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా మారాలని  అన్నారు. అమృత్‌‌ కాల్‌‌లో జరుగుతున్న  మొదటి వైబ్రంట్ గుజరాత్‌‌ గ్లోబల్ సమ్మిట్ ఇదేనని పేర్కొన్నారు. అందుకే ఈ ఈవెంట్‌‌ చాలా కీలకమని అన్నారు. ఈ ఈవెంట్‌‌లో పాల్గొన్న 100 కి పైగా  దేశాల ప్రతినిధులు తమకు కీలక పార్టనర్లని వెల్లడించారు. 

ఫ్రెండ్‌‌గా ఇండియా..

ఇండియాను నమ్మదగ్గ ఫ్రెండ్‌‌గా మిగిలిన దేశాలు చూస్తున్నాయని మోదీ అన్నారు. ‘స్టెబిలిటీకి కీలకమైన పిల్లర్‌‌‌‌గా ఇండియాను  ప్రపంచం చూస్తోంది. ప్రజలపై విశ్వాసం ఉన్న, ప్రపంచ ప్రయోజనాన్ని కోరుతున్న, గ్లోబల్ సౌత్‌‌కు వాయిస్‌‌గా, గ్లోబల్‌‌ ఎకానమీ గ్రోత్‌‌కు ఇంజిన్‌‌గా, సమస్యలకు పరిష్కారాన్ని చూపే టెక్నాలజీ హబ్‌‌గా, యువత, ప్రజాస్వామ్యాన్ని అందించే పవర్‌‌‌‌ హౌస్‌‌గా ఇండియాను మిగిలిన దేశాలు చూస్తున్నాయి’ అని మోదీ వివరించారు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్‌‌ సమ్మిట్‌‌లో మాట్లాడిన మోదీ ఇండియా– యూఏఈ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని చెప్పారు. యూఏఈ ప్రెసిడెంట్‌‌ షేక్‌‌ మహ్మద్‌‌ బిన్‌‌ జాయెద్‌‌ ఈ ఈవెంట్‌‌లో పాల్గొనడం తమకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. 

2047 నాటికి  30 ట్రిలియన్ డాలర్లకు..

దేశ ఎకానమీ 2027-28 నాటికి 5 ట్రిలియన్ డాలర్లు దాటుతుందని, మూడో అతిపెద్ద ఎకానమీగా మారుతుందని ఫైనాన్స్ మినిస్టర్‌‌‌‌ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి ఇండియా జీడీపీ   30 ట్రిలియన్ డాలర్లను టచ్ చేస్తుంద ని అంచనా వేశారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడ్డామని, ఎకానమీ వేగంగా రికవరీ అవుతోందని, వేగంగా వృద్ధి చెంద డం సాధ్యమేనని ఆమె పేర్కొన్నారు. గత 23 ఏళ్లలో ఇండియాలోకి 919 బిలియన్ డాలర్ల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌‌ మెంట్లు (ఎఫ్‌‌డీఐ) వచ్చాయని, ఇందులో 65 శాతం (595 బిలియన్ డాలర్లు) గత  పదేళ్లలో నే పొందామని సీతారామన్ పేర్కొన్నారు. 

గుజరాత్‌లో అదానీ రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు

వైబ్రంట్‌‌ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌‌లో పాల్గొన్న బడా కంపెనీలు  భారీ ఇన్వెస్ట్‌‌మెంట్ ప్రకటనలు చేశాయి. అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ  ఈ ఈవెంట్ మొదటి రోజు రూ.2 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌‌ మెంట్‌‌ ప్రకటన చేశారు. స్పేస్‌ నుంచి కూడా కనిపించే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ పార్క్‌‌ను గుజరాత్‌లో  ఏర్పాటు చేస్తామని, లక్ష మందికి ఉద్యో గాలు ఇస్తామని అన్నారు.  గత సమ్మిట్‌లో ప్రకటించిన రూ.55 వేల కోట్లలో రూ. 50 కోట్లు ఇప్పటికే ఇన్వెస్ట్ చేశామని పేర్కొన్నారు. హజీరా వద్ద  మొదటి కార్బన్ ఫైబర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌  చైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు. 

గత పదేళ్లలో ఇండియా మొత్తం మీద 150 బిలియన్ డాలర్లు (రూ. 12 లక్షల కోట్లు ) ఇన్వెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఇందులో మెజార్టీ భాగం గుజరాత్‌‌లోనే పెట్టామని చెప్పారు. టాటా సన్స్‌‌ సెమీకండక్టర్ ప్లాంట్‌‌ను సనంద్‌‌లో ఏర్పాటు చేయనుంది. దీని వివరాలు త్వరలో బయటకు రానున్నాయి. ఈ ప్లాంట్ కెపాసిటీ 20 గిగా వాట్‌‌ అవర్స్ అని కంపెనీ చైర్మన్‌‌ నటరాజన్‌‌ చంద్రశేఖరన్ పేర్కొన్నారు.  సుజుకీ మోటార్ కార్ప్‌‌ సబ్సిడరీ  మారుతి సుజుకీ తమ రెండో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌‌ను గుజరాత్‌‌లో పెడుతుందని  కంపెనీ ప్రెసిడెంట్‌‌ తొషిహిరో సుజుకీ పేర్కొన్నారు. 

ఇందుకోసం రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు.  ఈ ప్లాంట్‌‌ కెపాసిటీ  ఏడాదికి 40 లక్షల యూనిట్లు అని, 2028–29 నాటికి అందుబాటులోకి  వస్తుందని వెల్లడించారు. హజీరా దగ్గర 2029 నాటికి అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని  అర్సెలర్‌‌‌‌ మిట్టల్‌‌ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్‌‌ పేర్కొన్నారు. ఈ ప్లాంట్ కెపాసిటీ ఏడాదికి 24 మిలియన్ టన్నులని అన్నారు.  కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌లో గుజరాత్‌‌లో చిప్‌‌ ప్లాంట్‌‌ తయారీని ప్రారంభించామని మైక్రాన్‌‌ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా అన్నారు.