టైటిలైనా వదులుకుంటం కానీ పాక్‌‌‌‌తో మేం ఆడం..WCL టోర్నీ నుంచి వైదొలిగిన ఇండియా

టైటిలైనా వదులుకుంటం కానీ పాక్‌‌‌‌తో మేం ఆడం..WCL టోర్నీ నుంచి వైదొలిగిన ఇండియా

బర్మింగ్‌‌‌‌హామ్‌‌‌‌: వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ లెజెండ్స్‌‌‌‌ టోర్నీ నుంచి ఇండియా వైదొలిగింది. టోర్నీలో భాగంగా గురువారం ఎడ్జ్‌‌‌‌బాస్టన్‌‌‌‌ వేదికగా పాకిస్తాన్‌‌‌‌తో ఇండియా సెమీస్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ ఆడాల్సి ఉంది. కానీ పహల్గాం ఉగ్రదాడి, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ మ్యాచ్‌‌‌‌ ఆడేందుకు శిఖర్‌‌‌‌ ధవన్‌‌‌‌, ఇర్ఫాన్‌‌‌‌ పఠాన్‌‌‌‌, హర్భజన్‌‌‌‌ సింగ్‌‌‌‌, యువరాజ్‌‌‌‌ సింగ్‌‌‌‌, సురేశ్‌‌‌‌ రైనాతో కూడిన ఇండియా టీమ్‌‌‌‌ నిరాకరించింది.

ఇండియా సెమీస్‌ ఆడేందుకు ఒప్పుకోకపోవడంతో పాకిస్తాన్‌‌‌‌ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది.

లీగ్‌‌‌‌ దశలోనూ పాక్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ ఆడకపోవడంతో ఇరుజట్లకు చెరో పాయింట్‌‌‌‌ కేటాయించారు. యువీ నాయకత్వంలోని ఇండియా.. ఆఖరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో వెస్టిండీస్‌‌‌‌పై గెలిచి సెమీస్‌‌‌‌కు అర్హత సాధించింది.

సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీస్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ జరగనుంది. ఆగస్టు 2న ఫైనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ జరుగుతుంది. ఇక టోర్నీ స్పాన్సర్‌‌‌‌గా ఉన్న ఈజ్‌‌‌‌మైట్రిప్‌‌‌‌ వ్యవస్థాపకుడు ఇండో–పాక్‌‌‌‌ సెమీస్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు స్పాన్సర్‌‌‌‌షిప్‌‌‌‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.