షెఫాలీ మెరుపులు: సెకండ్‌‌‌‌ టీ20లో ఇండియా విన్

షెఫాలీ మెరుపులు: సెకండ్‌‌‌‌ టీ20లో ఇండియా విన్

హోవ్‌‌‌‌: షెఫాలీ వర్మ (38 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 48) మెరుపు బ్యాటింగ్‌‌‌‌కు.. బౌలర్ల క్రమశిక్షణ తోడవ్వడంతో ఇంగ్లండ్‌‌‌‌తో జరిగిన రెండో టీ20లో ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ 8 రన్స్‌‌‌‌ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను 1–1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌‌‌‌లో టాస్‌‌‌‌ ఓడి ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ చేసిన ఇండియా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 148 రన్స్‌‌‌‌ చేసింది. షెఫాలీ ధనాధన్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌తో ఇన్నింగ్స్‌‌‌‌కు అదిరిపోయే స్టార్ట్‌‌‌‌ ఇచ్చింది. స్మృతి మంధాన (20), షెఫాలీ వర్మ ఫస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 70 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ చేశారు. కానీ మిడిలార్డర్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌విమెన్‌‌‌‌ తగినంత వేగంగా రన్స్‌‌‌‌ చేయలేకపోవడంతో జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ (31)తోపాటు దీప్తీశర్మ (24 నాటౌట్‌‌‌‌) రాణించారు. ఇంగ్లిష్‌‌‌‌ బౌలర్లలో సివర్‌‌‌‌, డేవిస్‌‌‌‌, సారా గ్లెన్‌‌‌‌, మాడీ తలా ఓ వికెట్‌‌‌‌ తీశారు. అనంతరం ఛేజింగ్‌‌‌‌లో ఓవర్లన్నీ ఆడిన ఇంగ్లిష్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఎనిమిది వికెట్లు కోల్పోయి 140 రన్స్‌‌‌‌ చేసి ఓడింది. ఓపెనర్‌‌‌‌ బీమాంట్‌‌‌‌(59), కెప్టెన్‌‌‌‌ హీథర్‌‌‌‌నైట్‌‌‌‌(30) టాప్‌‌‌‌ స్కోరర్లు. దీప్తీ వేసిన 14వ ఓవర్‌‌‌‌లో వీరిద్దరూ వరుస బాల్స్‌‌‌‌లో ఔటవ్వడంతో మ్యాచ్‌‌‌‌  మలుపు తిరిగింది. ఇండియా బౌలర్లలో పూనమ్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (2/17) రెండు వికెట్లు తీసింది. దీప్తీశర్మకు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు దక్కింది.