టార్గెట్‌‌‌‌‌‌‌‌ క్లీన్స్వీప్‌‌‌‌‌‌‌‌.. ఇవాళ (డిసెంబర్ 30) లంకతో ఇండియా అమ్మాయిల ఐదో టీ20

టార్గెట్‌‌‌‌‌‌‌‌ క్లీన్స్వీప్‌‌‌‌‌‌‌‌.. ఇవాళ (డిసెంబర్ 30) లంకతో ఇండియా అమ్మాయిల ఐదో టీ20

తిరువనంతపురం: బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో అదరగొడుతూ ఇప్పటికే  వరుసగా నాలుగు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో శ్రీలంకను చిత్తు చేసిన ఇండియా అమ్మాయిలు.. ఆ జట్టుతో ఐదు టీ20ల సిరీస్‌‌‌‌‌‌‌‌కు, ఈ ఏడాదికి ఫినిషింగ్ టచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.  తమ దూకుడు కొనసాగిస్తూ  మంగళవారం జరిగే చివరి, ఐదో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ గెలిచి సిరీస్‌‌‌‌‌‌‌‌ను 5–0తో క్లీన్‌‌‌‌‌‌‌‌స్వీప్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌లో జరగనున్న టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యేందుకు ఈ సిరీస్ ఇండియా ఒక గొప్ప వేదికగా మార్చుకుంది.  

ఈ మ్యాచ్ తర్వాత ఇండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌లో మూడేసి టీ20లు ఆడనుంది. 2024  వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో లీగ్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌ తన ఆటతీరును మార్చుకుని మరింత దూకుడుగా ఆడుతూ ఇప్పటికే రెండు సిరీస్‌‌‌‌‌‌‌‌లను గెలుచుకుంది. లంకతో తొలి మూడు టీ20ల్లో టార్గెట్లను ఈజీగా ఛేజ్ చేసిన హర్మన్‌‌‌‌‌‌‌‌సేన గత పోరులో పరుగుల మోత  మోగించింది. తొలి మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించగా, బ్యాటర్లకు పెద్దగా అవకాశం రాలేదు. అయితే, నాలుగో టీ20లో ఇండియా బ్యాటింగ్ విభాగం విశ్వరూపం చూపింది. 

ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో162 రన్స్ జోడించి ఔరా అనిపించారు. ముఖ్యంగా షెఫాలీ వర్మ ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో లంక బౌలర్లకు సింహస్వప్నంగా మారింది. నాలుగు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో 185.82  స్ట్రైక్ రేట్‌‌‌‌‌‌‌‌తో మూడు హాఫ్ సెంచరీలు సాధించి నిలకడగా రాణిస్తోంది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఫామ్ లేమితో ఇబ్బంది పడినా నాలుగో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 48 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే 80 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసి మళ్లీ టచ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చింది. ఇక, గత పోరులో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్‌‌‌‌‌‌‌‌ను వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు పంపాలన్న నిర్ణయం కూడా ఫలితం ఇచ్చింది. వీళ్లు ఇదే జోరును కొనసాగిస్తే ఇండియా.. లంకను వైట్‌‌‌‌‌‌‌‌వాష్​ చేయడం కష్టమేం కాబోదు. 

ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌లోనే తడబాటు

బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో పాటు బౌలింగ్‌లో ఇండియా పటిష్టంగా ఉంది. ఏడాది విరామం తర్వాత జట్టులోకి వచ్చిన పేసర్ రేణుక ఠాకూర్ విజయవంతంగా రాణిస్తుండగా, దీప్తి శర్మ తన అనుభవంతో నిలకడగా బౌలింగ్ చేస్తోంది. ఈ సిరీస్‌తో అరంగేట్రం చేసిన 20 ఏండ్ల స్పిన్నర్ వైష్ణవి శర్మ కూడా సత్తా చాటుతోంది. 5.73 ఎకానమీ రేటుతో ఇప్పటికే నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకుంది. అయితే, ఫీల్డింగ్ వైఫల్యం ఇండియాను కలవరపెడుతోంది. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పేలవ ఫీల్డింగ్ చేసి హోమ్‌టీమ్ గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ రెండు క్యాచ్‌‌‌‌‌‌‌‌లు, ఒక స్టంపింగ్ అవకాశాన్ని జారవిడిచింది.  వీటిని సరిదిద్దుకోవాలని కెప్టెన్ హర్మన్‌‌‌‌‌‌‌‌భావిస్తోంది. 

లంకకు పరువైనా దక్కేనా

శ్రీలంక టీమ్ ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో తీవ్రంగా కష్టపడుతోంది. ఆ జట్టు బ్యాటింగ్ పూర్తిగా కెప్టెన్ చామరి ఆటపట్టుపైనే ఆధారపడి ఉంది. తొలి మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో తక్కువ స్కోర్లకే పరిమితమైన ఆటపట్టు గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 52 రన్స్‌‌‌‌‌‌‌‌తో ఫామ్‌‌‌‌‌‌‌‌లోకి రావడం ఆ జట్టుకు కొంత ఊరటనిచ్చే అంశం. అయితే, మిగతా బ్యాటర్లు కూడా రాణించాల్సిన అవసరం ఉంది. ఇక, లంక బౌలర్లు ఇండియా ఓపెనర్లను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన లంక.. ఆఖరాటలో గెలిచి పరువైన దక్కించుకుంటుందేమో చూడాలి.