ఫిఫా ర్యాంకింగ్స్‌‌లో సత్తాచాటిన ఇండియా విమెన్స్‌‌ ఫుట్‌‌బాల్‌‌ జట్టు

ఫిఫా ర్యాంకింగ్స్‌‌లో  సత్తాచాటిన ఇండియా విమెన్స్‌‌ ఫుట్‌‌బాల్‌‌ జట్టు

న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్‌‌ ఫుట్‌‌బాల్‌‌ జట్టు.. ఫిఫా ర్యాంకింగ్స్‌‌ను మెరుగుపర్చుకుంది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌లో ఇండియా ఏడు ప్లేస్‌‌లు ఎగబాకి 63వ ర్యాంక్‌‌లో నిలిచింది. ఏఎఫ్‌‌సీ విమెన్స్‌‌ ఆసియా కప్‌‌కు క్వాలిఫై కావడం ర్యాంక్‌‌ మెరుగుపడటానికి దోహదపడింది. రెండేళ్ల తర్వాత ఇండియా సాధించిన హయ్యెస్ట్‌‌ ర్యాంక్‌‌ ఇదే కావడం విశేషం. 

2023 ఆగస్టులో ఇండియా 61వ ర్యాంక్‌‌లో నిలిచింది. ఏఎఫ్‌‌సీ క్వాలిఫయర్స్‌‌ చివరి మ్యాచ్‌‌లో ఇండియా 2–1తో థాయ్‌‌లాండ్‌‌పై గెలిచి తొలిసారి ఆసియా కప్‌ టోర్నీకి అర్హత సాధించింది. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్‌‌ మ్యాచ్‌‌ల్లోనూ 13–0తో మంగోలియాను, 4–0తో తిమోర్‌‌ లెస్టీను, 5–0తో ఇరాక్‌‌ను ఓడించింది.