టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్


టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా మరో మ్యాచ్ ఆడుతుంది. జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ సేన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం సాధించడంతో...టీమిండియా సెమీస్ చేరింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ నామమాత్రం కానుంది. అయితే కీలకమైన సెమీస్ ముందు పసికూనగా భావించే జింబాబ్వేపై విజయం సాధించాలని టీమిండియా భావిస్తోంది. అయితే ఈటోర్నీలో పాక్తో జింబాబ్వే షాకివ్వడంతో...ఆ జట్టును తక్కువ అంచనా వేయొద్దని రోహిత్ సేన అనుకుంటోంది. మరోవైపు ఈ టోర్నీలో అంచనాలకు మంచి రాణించిన జింబాబ్వే..చివరి మ్యాచ్లో విజయం సాధించి..విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాలని చూస్తోంది. భారత్పై గెలిచి..కనీసం విజయగర్వంతో స్వదేశానికివెళ్లాలని అనుకుంటోంది. 

తుది  జట్లు 
ఇండియా: రోహిత్‌‌‌‌ (కెప్టెన్‌‌), రాహుల్‌‌, కోహ్లీ, సూర్యకుమార్‌‌, హార్దిక్‌‌ పాండ్యా, పంత్ ‌, అక్షర్‌‌ పటేల్‌‌, అశ్విన్‌‌, భువనేశ్వర్‌‌, షమీ, అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌.

జింబాబ్వే: ఎర్విన్‌‌ (కెప్టెన్‌‌), వెస్లీ మదెవరె, టోనీ మున్యోంగా, చకబ్వా, సీన్‌‌ విలియమ్స్‌‌, రజా, ర్యాన్‌‌ బర్ల్‌‌, విల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్‌‌ నగరవా, టెండి చటారా, బ్లెస్సింగ్‌‌ ముజరబాని.