టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

లండన్ : వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇండియా – ఆస్ట్రేలియా మధ్య ఇవాళ కీలకమైన లీగ్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికాతో ఆడిన భారత జట్టే ఆస్ట్రేలియాతోనూ బరిలోకి దిగుతోంది. జట్టులో మార్పులేమీ చేయలేదు. 

మొదటి మ్యాచ్‌‌లో కాస్త కష్టపడినా.. సౌతాఫ్రికాను ఓడించి బోణీ కొట్టిన కోహ్లీసేనకు మలిపోరులో  ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్రేలియా నుంచి సిసలైన పరీక్ష ఎదుర్కోనుంది. వన్డేల్లోగానీ.. వరల్డ్‌‌కప్‌‌ల్లో గానీ ఆసీస్‌‌ను చూడగానే కంగారు పడే  ఇండియా.. ఈసారి మాత్రం ఆ జట్టును చిత్తు చేయాలని భావిస్తోంది.  కంగారూలతో అవతలి జట్టుకు ఎప్పుడూ కంగారే. పైగా,  పెద్ద టోర్నీల్లో.. సవాల్‌‌ విసిరే మ్యాచ్‌‌ల్లో ఆ జట్టు తిరుగులేని ఆటతీరును కనబరుస్తుంది. ఒత్తిడిని ఎలా జయించాలో.. చేజారిపోతున్న మ్యాచ్‌‌లను ఎలా కాపాడుకోవాలో ఆసీస్‌‌కు వెన్నతో పెట్టిన విద్య.  విండీస్​తో మ్యాచే అందుకు  ఉదాహరణ. టాపార్డర్‌‌ కుప్పకూలినా.. ఆ జట్టు 280 ప్లస్‌‌ రన్స్‌‌ చేసింది. ఛేజింగ్‌‌లో కరీబియన్లు గెలుపు ముంగిట నిలిచినా..  అద్భుతమైన బౌలింగ్‌‌తో  వారిని అడ్డుకొని గెలిచింది. అందువల్ల ఆస్ట్రేలియా జట్టుకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోహ్లీదే.

భారరత జట్టు : ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ధోనీ, పాండ్యా, కేదార్ జాదవ్, భువనేశ్వర్ కుమార్, కులదీప్ యాదవ్, చాహల్, బుమ్రా.