హైదరాబాదీలకు బిగ్ అలర్ట్: వచ్చే ఐదు రోజులు భారీ కాదు, అతి భారీ వర్షాలు.. ఇళ్ల నుంచి బయటికి రాకండి..

హైదరాబాదీలకు బిగ్ అలర్ట్: వచ్చే ఐదు రోజులు భారీ కాదు, అతి భారీ వర్షాలు.. ఇళ్ల నుంచి బయటికి రాకండి..

రానున్న నాలుగైదు రోజులపాటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరిత ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని.. సోమవారం, మంగళవారం ( ఆగస్టు 11, 12 ) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. బుధవారం ( ఆగస్టు 13 ) పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని... దీంతో 13వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 

13, 14 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. 14వ తేదీ ఒకటి రెండు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఇదిలా ఉండగా.. ఇవాళ భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్,  హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్,  జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇవాళ, రేపు హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మిగతా అన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఈ క్రమంలో మంగళవారం ( ఆగస్టు 12 ) 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. 13, 14 తేదీల్లో హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 
 
వచ్చే నాలుగైదు రోజులు భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్న క్రమంలో జిల్లా యంత్రాంగం తో పాటు హైదరాబాద్ అధికారులను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.అక్కడక్కడ భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళద్దని సూచించింది.ఇప్పటికే  జిహెచ్ఎంసి హైడ్రా మాన్సూన్ డిఆర్ఎఫ్, పోలీస్, ట్రాఫిక్ కి ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ముప్పు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, మూసి పరవాహక ప్రాంతాలు  ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.