
న్యూఢిల్లీ: ఇండియా యంగ్ షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌తో మెరిశాడు. బుధవారం జరిగిన మెన్స్ 50మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో 22 ఏండ్ల తోమర్ 463.5 స్కోరుతో గోల్డ్ నెగాడు. మరోవైపు ఇదే కేటగిరీ టీమ్ ఈవెంట్‌లో తోమర్, స్వప్నిల్ కుశాలే, అఖిల్ షెరాన్‌తో కూడిన టీమ్ 1764 స్కోరుతో సిల్వర్ గెలిచింది.