
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో ఇండియా యంగ్ షట్లర్ మాళవిక బన్సొద్ మెయిన్‌డ్రాకు చేరుకుంది. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్ గ్రూప్–బి తొలి మ్యాచ్‌లో మాళవిక 21–18, 21–10తో నురాని రతు (యూఏఈ)ని ఓడించింది. రెండో రౌండ్‌లో 21–4, 21–5తో సోఫియా జకిరోవా (ఉజ్బెకిస్తాన్)ను చిత్తు చేసి మెయిన్ డ్రాలో అడుగు పెట్టింది. రుతపర్ణ, శ్వేతపర్ణ సిస్టర్స్ విమెన్స్ డబుల్స్‌లో మెయిన్ డ్రా చేరారు. రెండో రౌండ్‌లో 21–18, 21–16తో వెంగ్ చి–పుయి చి వా (మకావు) జంటను ఓడించారు.