Tahir Raj Bhasin: పాత్రను బట్టి ప్రిపరేషన్.. తాహిర్ రాజ్ సక్సెస్ జర్నీ ఇది.. ఎవరీ ఇన్స్పిరేషన్ నటుడు?

Tahir Raj Bhasin: పాత్రను బట్టి ప్రిపరేషన్.. తాహిర్ రాజ్ సక్సెస్ జర్నీ ఇది.. ఎవరీ ఇన్స్పిరేషన్ నటుడు?

కొన్ని సినిమాలు, సిరీస్​లు చూస్తున్నప్పుడు..ఈ యాక్టర్ ఎవరో భలే నటిస్తున్నాడే అనిపిస్తుంటుంది. మనకు తెలియకుండానే తన పర్ఫారెన్స్​ని మెచ్చుకుంటూ ఉంటాం. ఆ క్యారెక్టర్​ పాజిటివ్​ లేదా నెగెటివ్​ అయినా మైండ్​లో అలానే గుర్తుండిపోతుంది. అలాంటి పాత్రలు రావడం, వాటిలో బాగా నటించి పేరు తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. అలాంటి నటుల్లో ఒకరే.. తాహిర్ రాజ్ భాసిన్​. హిందీ ఇండస్ట్రీలో సినిమాలు, సిరీస్​లు చేస్తూ.. ఎప్పటికప్పుడు తన పాత్రలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తూ తన నటనతో సర్​ప్రైజ్ చేస్తోన్న తాహిర్ రాజ్ భాసిన్ (Tahir Raj Bhasin) జర్నీ ఇది. 

తా హిర్ రాజ్ భాసిన్​ది న్యూఢిల్లీ. వాళ్ల నాన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్​లో పనిచేసేవారు. అమ్మ కాన్ఫెడరేషన్​ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఎప్​టెక్ కంప్యూటర్స్​లలో పనిచేసేవారు. ఇంట్లో ఉన్న ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు రాజ్​. తన తమ్ముడు పైలట్. ఇక తాహిర్​కి చిన్నప్పటి నుంచి ఆటపాటలంటే ఆసక్తి ఎక్కువ. స్కూల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో యాక్టివ్​గా పాల్గొనేవాడు.

మొదటి నుంచీ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో టీనేజీ నుంచే నటన నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హిందూ కాలేజీలో పొలిటికల్ సైన్స్​ చదివాడు. ఆ టైంలోనే ఆమిర్ రజా హుస్సేన్​ అనే నాటకాలకు సంబంధించిన వ్యక్తితో కలిసి వర్క్​షాప్​లకు అటెండ్ అయ్యేవాడు.

అలా ఎన్నో నాటకాలు, డాన్స్​ పర్ఫార్మెన్స్​లు ఇచ్చాడు. అయితే, ఐఐటీ బాంబేస్ మూడ్ ఇండిగో ఫెస్టివల్​ జరుగుతున్న సమయంలో అతను కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అప్పుడే తను యాక్టర్​ అవ్వాలని డిసైడ్​ అయ్యాడు. మెల్​బోర్న్ యూనివర్సిటీ నుంచి మీడియా విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నాడు. పద్దెనిమిదేండ్ల వయసులో నేషనల్ న్యూస్​ ప్రొడక్షన్​ కంపెనీలో పనిచేశాడు. న్యూస్​ చానెల్ తరఫున క్యాంపస్​లో హోస్టింగ్ చేశాడు.

23 ఏండ్ల వయసులో తాహిర్ యాక్టింగ్, మోడలింగ్​లో ట్రైనింగ్ తీసుకోవాలనే ఆలోచనతో ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. అడ్వాన్స్డ్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్​లో చేరి ఒక సంవత్సరం పాటు బిహేవియర్ స్టడీస్ చేశాడు. అక్కడే తాహిర్, బాడీ లాంగ్వేజ్​, బిహేవియరల్​ ఎనలైటిక్స్​ నేర్చుకున్నాడు. 2013లో నసీరుద్దీన్ షా నిర్వహించిన సమ్మర్ ఇంటెన్సివ్ యాక్టింగ్​, వాయిస్ ట్రైనింగ్​ ప్రోగ్రామ్​లో పార్టిసిపేట్ చేశాడు. 

అమెరికన్లను ఇన్​స్పైర్ చేసిన క్యారెక్టర్:

ఆ తర్వాత 2012లో యాక్టింగ్​ ప్రొఫెషన్​లో అడుగుపెట్టాడు తాహిర్. నాలుగు షార్ట్​ ఫిల్మ్స్​లో నటించాడు. కమర్షియల్ యాడ్స్​లోనూ కనిపించాడు. అదే సంవత్సరం కామెడీ థ్రిల్లర్ అయిన కిస్మత్​ లవ్ పైసా దిల్లి అనే సినిమాలో గెస్ట్ రోల్​లో కనిపించాడు. తర్వాత కై పొ చే, ఒన్​ బై టు వంటి సినిమాల్లో నటించాడు. 2014లో మర్దానీ అనే సినిమాతో ఇండియన్ ఇండస్ట్రీనే కాదు.. అమెరికన్ టీవీ సిరీస్​లను కూడా ఇన్​స్పైర్ చేసినట్టు అక్కడ కథనాలు కూడా వచ్చాయి. నెగెటివ్ రోల్ అయినప్పటికీ అందులో తను చేసిన పర్ఫార్మెన్స్​తో ఆడియెన్స్​ను ఆకట్టుకున్నాడు.

2016లో ఫోర్స్​ 2 అనే యాక్షన్ స్పై థ్రిల్లర్​ మూవీలో నటించి నటుడిగా ఒక మెట్టు ఎక్కాడు. ఈ రెండు సినిమాలతో తాహిర్ 2017 ఫోర్బ్స్​ మ్యాగజైన్ 30 అండర్ 30 లిస్ట్​లో చేరాడు. ఆ మరుసటి సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్​లో రెడ్ కార్పెట్ మీద నడిచాడు. 2019లో దంగల్, చిచ్చోరే సినిమాల్లో లీడ్ రోల్స్​లో ఒక పాత్ర  పోషించాడు. అలా 83, లూప్ లపేటా వంటి సినిమాల్లో నటించాడు.

ప్రస్తుతం సాలే ఆషిఖ్, కాలింగ్ కరణ్ అనే సినిమాల్లో నటిస్తున్నాడు. సినిమాలే కాదు.. 2016 నుంచి సిరీస్​ల్లోనూ తాహిర్ నటిస్తూ ఉన్నాడు. రంజిష్ హి సాహి, యే కాళీ కాళీ ఆంఖీన్, సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వంటి సిరీస్​ల్లో నటించాడు. ఇప్పటికే ఎన్నో అవార్డులు కూడా అందుకున్న తాహిర్.. ప్రస్తుతం స్పెషల్ ఓపీఎస్​ –2 సిరీస్​తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 

షారుఖ్​ ఖాన్ ఇన్​ఫ్లుయెన్స్:

ప్రతి రంగంలో అందరికీ ఎవరో ఒకరు ఇన్​స్పిరేషన్​గా ఉంటారు. వాళ్ల జర్నీ చూసి మోటివేట్ అవుతూ ఉంటారు. అలాగే తాహిర్ జర్నీలోనూ ఒకరు ఉన్నారు. ఆయనే షారుఖ్​ ఖాన్. ‘‘నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచీ షారుఖ్​ ఖాన్ ఇన్​ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉండేది.

యాక్టర్ అవ్వాలని కలలు కనే ఒక సాధారణ వ్యక్తి సూపర్ స్టార్ స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. ఆ విషయంలో షారుఖ్ జర్నీ నన్ను చాలా ఇన్​స్పైర్ చేసింది. ఆయన ఒక కథానాయకుడిగానే కాదు.. ప్రతినాయకుడి పాత్రల్లోనూ మెప్పించాడు. ‘యే కాళీ కాళీ ఆంఖీన్’సిరీస్​లో నా పాత్ర షారుఖ్​ని గుర్తుచేస్తుంది” ఆ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా చెప్పాడు. 

యాక్టింగ్ చేసేటప్పుడు యాంగ్జైటీ! 

‘‘మొదట్లో నేను యాక్టింగ్ చేసేటప్పుడు యాంగ్జైటీ ఉండేది. మర్దానీ సినిమాలో రాణీ ముఖర్జీకి వ్యతిరేకంగా ఉండే పాత్రలో చేశాను. ఆవిడ నటనలో చాలా సీనియర్, నేను అప్పుడప్పుడే అడుగులు వేస్తున్నా. అలాంటప్పుడు నాకు ఆ పాత్ర రావడంతో చాలా ప్రిపరేషన్ చేయాల్సి వచ్చింది. నిజానికి ఒక్కో ప్రాజెక్ట్ కి మెరుగవుతూ వస్తారు. ఎంత ఎక్కువ మెరుగైతే క్రియేటివిటీ అంత బాగా తెలుస్తుంది. కానీ నాకు స్టార్టింగ్​లోనే చాలెంజింగ్ రోల్ రావడంతో నేను చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యాను.

83 సినిమా చేసేటప్పుడు కూడా ఒక లెజెండ్ పాత్రలో కనిపిస్తున్నప్పుడు దానికి తగ్గట్టు ప్రిపరేషన్ ఉండాలి అని.. దానికి సంబంధించిన ఎన్నో సినిమాలు చూశాను. ఓ పుస్తకం చదివా. ఆ పుస్తకం చదవడం నాకు చాలా హెల్ప్ అయింది. క్యారెక్టర్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడింది. సో, ప్రిపరేషన్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. పాత్రను బట్టి ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా మారుతూ ఉంటుంది” అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు తాహిర్. 

సినిమా వర్సెస్ ఓటీటీ:

‘‘సినిమా, ఓటీటీ కచ్చితంగా ఉండాలి. కొన్ని స్టోరీలు బిగ్ స్క్రీన్​ పై చూపించాలనే ఎగ్జైట్​మెంట్ ఉంటుంది. అలాంటి సినిమాలు థియేటర్​లో బిగ్ స్క్రీన్​ మీద చూస్తేనే ఆ ఎక్స్​పీరియెన్స్ బాగా అనిపిస్తుంది. కానీ, కథలు మాత్రం ఎపిసోడ్ల వారీగా చెప్తుంటే ఎంగేజింగ్​గా ఉంటాయి. అదొక రకమైన స్టోరీ టెల్లింగ్​. కాబట్టి రెండు ప్లాట్​ఫామ్స్ ఉండడం మంచిదే.

ఓటీటీ రావడం వల్ల ఎంతోమంది యాక్టర్స్​కి అవకాశాలు దొరుకుతున్నాయి. ఇకపోతే.. అవార్డులు అనేవి ఒక వాలిడేషన్​ మాత్రమే. ఇండస్ట్రీ అనే కుటుంబంలో లభించే ఒక గుర్తింపు. దాన్ని ఎవరు మాత్రం కాదనుకుంటారు? ఇంటర్నేషనల్​గా గుర్తింపు రావాలనే కోరిక నాకూ ఉంది. కానీ, మనం ఎక్స్​పెక్ట్ చేసినంతమాత్రాన ఏదీ మనకు రాదు. ఎప్పుడైనా తక్కువ అంచనాలు పెట్టుకోవడమే ఉత్తమం”అంటున్నాడు తాహిర్. 

సోలో ట్రావెలింగ్:

‘‘ఏదైనా ఒక ఇంటెన్స్ సీన్ షూటింగ్ చేసినప్పుడు ఆ జోన్​ నుంచి బయటకు రావడం అంత ఈజీ కాదు. అలాంటప్పుడు వెంటనే నా ఫ్రెండ్స్​ని కలవడానికి వెళ్తుంటా.  స్క్రిప్ట్​ని కూడా నాతోపాటు ఇంటికి తీసుకెళ్లడం నాకిష్టం లేదు. రేపటి సీన్స్ కోసం పరిశోధిస్తూ స్క్రిప్ట్​లోనే మునిగిపోయి ఉండేవాళ్లను చాలామందిని చూశాను. కానీ, ఎప్పడూ ఎంగేజ్​ అవ్వడమే కాదు.. మన కోసం మనం డిస్​ఎంగేజ్ కూడా అవుతూ ఉండాలి.

నాకు ఒకవేళ షూటింగ్ షెడ్యూల్స్​లో టైం గ్యాప్​ దొరికితే వెంటనే ట్రావెలింగ్​కి వెళ్తుంటా. అదొక్కటే నన్ను రిలీఫ్ చేసేది. పైగా సోలో ట్రావెలింగ్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే నాతో నేనే ఉంటాను కాబట్టి. అదొక థెరపీలా అనిపిస్తుంటుంది” అని తాహిర్ తన ఫీలింగ్స్​ షేర్ చేసుకున్నాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioHotstar (@jiohotstar)