పాక్‌లో భారత్‌ ఎయిర్‌ అంబులెన్స్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

పాక్‌లో భారత్‌ ఎయిర్‌ అంబులెన్స్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

భారత్‌కు చెందిన ఎయిర్‌ అంబులెన్స్‌ పాకిస్తాన్‌ గగనవీధుల్లోకి వెళ్లింది. వెళ్లడమే కాకుండా ఇస్లామాబాద్‌ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యేందుకు ప్రయత్నించింది. దానికి పాక్ పౌర విమానాయాన అధికారుల నుంచి అనుమతి కూడా తీసుకుంది. బ్రిటన్‌కు చెందిన ఓ పేషెంట్‌ను తజికిస్తాన్‌ తీస్కెళ్తుండగా మార్గమధ్యంలో ఇంధనం కోసం అత్యవసరంగా పాక్ లో భారత్ ఎయిర్‌ అంబులెన్స్‌ హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయింది.

బ్రిటన్‌కు చెందిన ఓ పేషెంట్‌ను కోల్‌కతా నుంచి తజికిస్తాన్‌ రాజధాని దుషన్‌బేకు తరలించేందుకు భారత్ ఎయిర్‌ అంబులెన్స్‌ బయల్దేరింది. అయితే ఇంధనం తక్కువగా ఉండటంతో మార్గమధ్యంలో ఇబ్బంది రాకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా పాకిస్తాన్‌లో ఫ్యూయల్ కోసం పాకిస్తాన్‌ సివిల్‌ ఏవియేషన్‌ అధికారులను సంప్రదించి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత ఇస్లామాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి ఇంధనం నింపుకుని రెండు గంటల తర్వాత కజికిస్తాన్‌కు బయల్దేరింది. ఇండియాకు చెందిన ఈ ఎయిర్‌ అంబులెన్స్‌లో బ్రిటన్‌కు చెందిన పేషెంట్‌తో పాటు ఒక డాక్టర్‌, ఇద్దరు నర్సులు ఉన్నట్లు తెలుస్తోంది.