
ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నది ఎవరికో తెలుసా? డొనాల్డ్ ట్రంప్‌కి. అమెరికా ప్రెసిడెంట్ కుర్చీనే వదలనని కూచున్న అంతటి ట్రంప్‌ని కూడా సింపుల్‌గా తీసిపడేసింది ట్విట్టర్. శాశ్వతంగా ట్రంపు అకౌంట్‌ని లేపేస్తున్నట్టు చెప్పి షాకిచ్చింది. ఇంత తెగువ ఎలా వచ్చింది? ఈ అనుమానం చాలామందికే వచ్చింది. ఈ డేరింగ్ నిర్ణయాల వెనుక ఉన్నది “విజయ గద్దె”. ట్విట్టర్ లీగల్ హెడ్. తెలుగు మూలాలున్న కుటుంబం నుంచి వచ్చిన విజయ తీసుకున్న నిర్ణయమే ట్రంప్ ఖాతా తొలగింపు. పుట్టింది హైదరాబాదే అయినా చిన్నప్పుడే అమెరికాకి షిఫ్ట్ అయిపోయారు విజయ. అక్కడే ‘లా’ చదువుకొని డాక్టరేట్ కూడా తీసుకున్నారు. తర్వాత వేరు వేరు ఆర్గనైజేషన్స్‌లో పని చేస్తూ ట్విట్టర్‌లో చేరారు. ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా ఆమె ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారట. ట్విట్టర్ సీఇఓ జాక్ డోర్సీకి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ట్విట్టర్‌కు లీగల్‌గా సమస్యలేమీ రాకుండా, జనం నుంచి విమర్శలు రాకుండా కాపాడుకుంటూ వస్తున్నారామె.