క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లోనే ఓడిన ఆర్చరీ జట్లు

క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లోనే ఓడిన ఆర్చరీ జట్లు

షాంఘై: ఇండియా ఆర్చరీ మెన్స్‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌కు.. వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌–2లో చుక్కెదురైంది. బుధవారం జరిగిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో జ్యోతి సురేఖ–అదితి స్వామి–అవ్నీత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌తో కూడిన ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ 228–231తో టర్కీ చేతిలో ఓడింది. ఒజాస్‌‌‌‌‌‌‌‌ డియోటలే–రిషబ్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌–ప్రథమేష్‌‌‌‌‌‌‌‌ జ్వాకర్‌‌‌‌‌‌‌‌తో కూడిన ఇండియా మెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ 231–234 స్కోరుతో మెక్సికో చేతిలో కంగుతిన్నది. అయితే మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్​లో  ఒజాస్‌‌‌‌‌‌‌‌–జ్యోతి సురేఖ ఇంకా రేసులోనే ఉన్నారు. రికర్వ్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫికేషన్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ ఆర్చర్లు సత్తా చాటారు. సిమ్రన్‌‌‌‌‌‌‌‌జీత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ (648), భజన్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ (638), అంకితా భాకట్‌‌‌‌‌‌‌‌ (630) వరుసగా 7, 17, 24వ స్థానాల్లో నిలిచారు. టీమ్​ ఈవెంట్​లో తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో బై లభించడంతో ఇండియా డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ బరిలోకి దిగనుంది. మెన్స్‌‌‌‌‌‌‌‌ రికర్వ్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో బొమ్మదేవర ధీరజ్‌‌‌‌‌‌‌‌ (656) 13వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలవగా, అటాను దాస్‌‌‌‌‌‌‌‌ (638), నీరజ్‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌ (638) వరుసగా 44, 47వ స్థానాలకు పడిపోయారు. తరుణ్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌ 631 పాయింట్లతో 57వ స్థానంలో నిలిచి పోటీకి దూరమయ్యాడు.