
విమానం ఆలస్యం కావడంతోఇండియా ఆర్చరీ జట్టు వరల్డ్‌కప్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. కొలంబియాలోని మెడెలిన్‌లో సోమవారం మొదలయ్యే సీజన్ ఫస్ట్ స్టేజ్ వరల్డ్‌కప్ కోసం 23 మందితో కూడిన సీనియర్ రికర్వ్, కాంపౌడ్స్ జట్లు ప్రయాణానికి రెడీఅయ్యాయి. తొలుత ఢిల్లీ నుంచి ఆమ్‌స్టర్ డామ్‌కు, అక్కడి నుంచి బొగొటా మీదుగా మెడెలిన్‌కు బయల్దేరాలన్నది ప్రణాళిక. కానీ, ఆమ్‌స్టర్ డామ్‌కు వెళ్లాల్సి డచ్ ఎయిర్ లైన్స్ విమానం ఢిల్లీలో రెండు గంటల 53 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. దాంతో, నిర్ణీత టైమ్‌లోగా బొగొటా ఫ్లైట్ ను ఇండియా టీమ్ అందుకోలేకపోయింది. సోమవారం లోపు మెడెలిన్‌కు వెళ్లే అవకాశం లేకపోవడంతో టోర్నీ నుంచి వైదొలగక తప్పలేదు.