Krishna Janmashtami 2025 : కృష్ణుడిని తులసి ఆకులతో పూజ చేయండి.. ఇంట్లో లక్ష్మీదేవి కళకళలాడుతోంది..!

Krishna Janmashtami 2025 : కృష్ణుడిని తులసి ఆకులతో పూజ చేయండి.. ఇంట్లో లక్ష్మీదేవి కళకళలాడుతోంది..!

శ్రీకృష్ణాష్టమి.. జన్మాష్టమి రోజున తులసి ఆకులతో పూజ చేయాలని పండితులు చెబుతున్నారు.  కృష్ణునికి ఇష్టమైన తులసిని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు.

తులసి శ్రీ కృష్ణ భార్య కాదు, విష్ణువు గొప్ప భక్తులలో ఒకరు. కృష్ణుడు కూడా విష్ణువు అవతారమే కావున కృష్ణాష్టమి రోజున తులసి చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. అందువల్ల జన్మాష్టమి రోజున తులసికి సంబంధించిన కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా శ్రీకృష్ణుడు, లక్ష్మీదేవిల ఆశీస్సులు లభిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.

తులసి చెట్టు దగ్గన ఆవు నెయ్యితో దీపం:   జన్మాష్టమి ( ఆగస్టు 16) న  పూజ చేసేటప్పుడు తులసి మొక్క ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నురాలై.. సంపద..ఐశ్వర్యం ఇస్తుందని పండితులు చెబుతున్నారు.

Also read:-శ్రీ కృష్ణుడి ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటున్నామో ఎంతమందికి తెలుసు..?

తులసి దండను సమర్పించండి:  కృషటాష్టమి రోజున  కృష్ణ పరమాత్మునకు తులసి మాల సమర్పిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు. కన్నయ్య  మెడలో తులసి మాల వేయడం వలన కష్టాలు తొలగుతాయని నమ్మకం.  మానసిక ప్రశాంతత, దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నమ్ముతారు. 

తులసి మొక్కను ఇంటికి తీసుకురండి: కృష్ణాష్టమి( ఆగస్టు16)న  ఇంట్లో తులసి మొక్కను నాటండి. . ఈ మొక్కను ఇంటి ప్రాంగణంలో లేదా ఈశాన్య దిశలో నాటండి. దీన్ని క్రమం తప్పకుండా పూజించడం వలన లక్ష్మీ దేవి ఇంట్లో నివసిస్తుంది. పూజ చేసిన తరువాత మూడు లేదా ఏడు సార్లు ప్రదక్షిణలు చేయండి. దీనివలన వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగిపోతుందని పండితులు చెబుతున్నారు.

నైవేద్యంలో తులసి దళాలు : జన్మాష్టమి రోజున ( ఆగస్టు16) , భక్తులు శ్రీకృష్ణుడికి లడ్డూ, వెన్న, ఖీర్ మొదలైన వాటిని సమర్పిస్తారు. ఈ వస్తువులను నైవేద్యం పెట్టడంతో పాటు, మీరు శ్రీకృష్ణుడికి తులసిని కూడా సమర్పించాలి. తులసి లేని నైవేద్యం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. నైవేద్యానికి తులసి ఆకులను జోడించడం ద్వారా శ్రీకృష్ణుడు ఆ నైవేద్యాన్ని త్వరగా స్వీకరించి భక్తుల ప్రార్థనలను వింటాడని పండితులు చెబుతున్నారు. ఈ పరిహారం చేయడం ద్వారా, ఇంట్లో ప్రతికూల శక్తి అంతమై సానుకూలత వ్యాపిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.