
ఎండాకాలంలో నీటిని ఆదా చేయడానికి ప్రజలు చాల ప్రయత్నాలు చేస్తుంటారు. అనవసరంగా క్లినింగ్ చేయడం, కార్ కడగడం, ట్యాప్ లీకేజీలను రిపేర్ చేయడం ఇలా చాలానే ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం బ్రిటన్ ప్రభుత్వం ఒక కొత్త సూచన చేసింది. నీటిని ఆదా చేయడానికి పాత డిజిటల్ ఫోటోలు, ఈమెయిల్ డిలేట్ చేయాలనీ సూచించింది. ఇది మీకు జోక్‌గా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఒక పెద్ద కారణం ఉంది, అది మన డిజిటల్ లైఫ్ స్టయిల్ సంబంధించినది.
నిజానికి మన ఫోటోలు, వీడియోలు, ఈమెయిల్స్ ఇవన్నీ ఏదో ఒక డేటా సెంటర్‌లో స్టోర్ అవుతుంటాయి. ఈ డేటా సెంటర్లు పెద్ద పెద్ద సర్వర్‌లతో ఉంటాయి, అవి ఎప్పుడు వేడిగా ఉంటాయి. విటిని చల్లబరచడానికి నీరు లేదా విద్యుత్తుతో నడిచే కూలింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తారు.
డేటా సెంటర్ దాహం: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం ప్రకారం కేవలం 1 మెగావాట్ సామర్థ్యం ఉన్న ఒక చిన్న డేటా సెంటర్ కూడా ప్రతి సంవత్సరం లక్షల లీటర్ల నీటిని కూలింగ్ కోసం ఉపయోగించుకోగలదు. అయితే, ఈ మొత్తం కూడా ప్రదేశం, టెక్నాలజీ బట్టి మారొచ్చు. తాగునీటిపై ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని డేటా సెంటర్లు ఇప్పుడు తాగడానికి పనికిరాని లేదా రీసైకిల్ చేసిన నీటిని ఉపయోగిస్తున్నాయి. అలాగే కొన్ని కంపెనీలు వాతావరణం, స్థానిక నిబంధనలతో ఎయిర్-కూలింగ్ లేదా వేడిని పీల్చే(evaporative) కూలింగ్ టెక్నాలజీకి మారుతున్నాయి.
Also read:-మెప్పుకోసం మధ్యతరగతి భారతీయుల పాకులాట.. లగ్జరీ లైఫ్ స్టయిల్ ట్రాప్‌పై సీఏ హెచ్చరిక..!
టెక్ కంపెనీల కొత్త ప్రయోగాలుపెద్ద టెక్ కంపెనీలు నీటి వాడకాన్ని తగ్గించడానికి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయి. అమెరికాలోని జార్జియాలోని డగ్లస్ కౌంటీలో రీసైకిల్ చేసిన మురుగునీటితో డేటా సెంటర్‌ను చల్లబరిచే ప్రయోగం చేసింది. నీటిని ఆదా చేయడానికి మైక్రోసాఫ్ట్ నీటి అడుగున డేటా సెంటర్‌ను కూడా పరీక్షించింది, దీనిలో చల్లని సముద్రపు నీరు సర్వర్‌లను చల్లబరుస్తుంది.
పెద్ద టెక్ కంపెనీలు నీటి వాడకాన్ని తగ్గించడానికి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయి. అమెరికాలోని జార్జియాలోని డగ్లస్ కౌంటీలో రీసైకిల్ చేసిన మురుగునీటితో డేటా సెంటర్‌ను చల్లబరిచే ప్రయోగం చేసింది. నీటిని ఆదా చేయడానికి మైక్రోసాఫ్ట్ నీటి అడుగున డేటా సెంటర్‌ను కూడా పరీక్షించింది, దీనిలో చల్లని సముద్రపు నీరు సర్వర్‌లను చల్లబరుస్తుంది.
విద్యుత్, నీటి వినియోగం పెరుగుతుంది: AI & మెషిన్ లెర్నింగ్‌కు పెరుగుతున్న డిమాండ్‌తో డేటా ప్రాసెసింగ్ అవసరం కూడా వేగంగా పెరుగుతోంది. అంటే డిజైన్‌లో మార్పులు చేయకపోతే, భవిష్యత్తులో విద్యుత్, నీటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది.
ఫోటోలను డిలేట్ చేయడం వల్ల నిజంగా నీరు ఆదా అవుతుందా: సాధారణంగా ఎవరైనా ఒకరు కొన్ని పాత ఫోటోలు లేదా ఇమెయిల్‌లను డిలేట్ చేస్తే అది నీటి పొదుపుపై వెంటనే ప్రభావం చూపదు. కానీ పెద్ద ఎత్తున బిలియన్ల గిగాబైట్ల డేటా తగ్గితే భవిష్యత్తులో డేటా సెంటర్ సామర్థ్యాన్ని పెంచే అవసరం, కొత్త కూలింగ్ సెటప్‌ల అవసరం కూడా తగ్గవచ్చు. అయినా నీటిని ఆదా చేయడానికి మరిన్ని మార్గాలు ఉన్నాయి, అవి ఇంట్లో పైప్ లీకేజీ రిపేర్ చేయడం, తక్కువసేపు స్నానం చేయడం, అనవసరంగా కార్ వాష్ చేయడం, నీటిని తెలివిగా ఉపయోగించడం వంటివి ఉన్నాయి.