
Luxury Lifestyle Trap: గడచిన కొన్ని సంవత్సరాలుగా భారతీయులు పాశ్చాత్య ఆర్థిక అలవాట్ల వైపు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. క్రెడిట్ కార్డులు ఎడాపెడా వాడేటయం.. లగ్జరీ జీవితం కోసం ఈఎంఐలపై షాపింగ్ చేయటం వంటివి పెరిగిపోతున్నాయి. అయితే దీనిపై తాజాగా సీఏ నితిన్ కౌషిక్ ప్రజలను హెచ్చరిస్తున్నారు.
భారతీయ మధ్యతరగతి ప్రజలు తమ ఖర్చుల ధోరణిని పరిశీలించుకోవాలని.. పెట్టుబడిని అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. అప్పులు చేస్తూ లగ్జరీ హైఫై జీవితం గడపటం భవిష్యత్తులో పెద్ద ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయని తన ఎక్స్ పోస్టులో ఆయన చెప్పారు. వేరేవారిని మెప్పించటం కోసం లగ్జరీగా ఖర్చు చేయటం స్వల్పకాలంలో హ్యాపీగా అనిపించినప్పటికీ అది దశాబ్ధాల పాటు అప్పుల ఊబిలో చిక్కుకునేలా చేస్తుందని.. జీవితం మెుత్తం ఈఎంఐ చెల్లింపులతో నిండిపోతుందని అన్నారు. ప్రజలు దీర్ఘకాలిక వ్యూహంతో క్రమశిక్షణతో పెట్టుబడులపై ఫోకస్ పెట్టాలని మధ్యతరగతికి సూచించారు.
Also Read;-మీ పాత ఫోటోలు లక్షల లీటర్ల నీటిని కూడా తాగగలవు, నిజం తెలిస్తే షాక్ అవుతారు..
రూ.25 లక్షలు రుణంగా తీసుకోవటం చాలా సులువని అయితే దానిని రీపే చేయటానికి రూ.40లక్షల నుంచి రూ.45లక్షలు చివరికి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు సీఏ కౌషిక్. జస్ట్ ఒక సంతకం పెట్టగానే లోన్ వచ్చినప్పటికీ దాని కింద దాగి ఉన్న ఖర్చులను చాలా మంది గమనించటం లేదన్నారు. ఈఎంఐలు లేని జీవితమే నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందిస్తుందని చెప్పారు కౌషిక్. నెలకు అందంగా కనిపించటానికి రూ.5వేలు ఖర్చు చేయటం వల్ల ఎలాంటి రాబడి దానిపై తిరిగి రాదని అదే మెుత్తాన్ని సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి పెడితే 20 ఏళ్లలో రూ.30 లక్షలుగా మారుతుందని చెప్పారు.
ఈరోజు సులువుగా కనిపించినది రేపు కష్టంగా మారుతుందని అందుకే దుబారా ఖర్చుల కోసం క్రెడిట్ కార్డ్ వాడకం, లోన్స్ తీసుకోవటం కంటే ప్రపంచంలో అప్పులు లేకుండా జీవించటం ముఖ్యం అన్నారు. ట్రావెల్ ట్రిప్స్, లగ్జరీ లైఫ్ తో ఇతరులను ఏమార్చటానికి చేసే ఖర్చు దండగేనన్నారు కౌషిక్. కానీ చాలా మంది యువత, ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు ఈ ట్రాప్ లో ఎక్కువగా చిక్కుకుంటున్నారని అన్నారు.
అక్కర్లేని వస్తువులు, అక్కర్లేని ఖర్చులకు వీలైనంత దూరంగా ఉండటం మంచిని సూచించారు. చెప్పిన మాట వినకపోతే జీవితంలో ముందుకెళ్లే కొద్ది కష్టపడి సంపాదించిన డబ్బును లగ్జరీ అలవాట్లు కరిగించేస్తాని.. అవసరమైన రోజుల డబ్బుకు చేయిచాచే పరిస్థితులు తెచ్చే ప్రమాదంలో లైఫ్ పడుతుందని హెచ్చరించారు. క్రమశిక్షణగా డబ్బు పెట్టుబడిపెట్టేవారు కాంపౌండింగ్ వల్ల సంపదను పెంచుకోవటంతో పాటు రుణ రహిత జీవితాన్ని తర్వాతి తరాలకు అందించగలరన్నారు సీఏ కౌషిక్.