డోప్ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారత అథ్లెట్ దీక్ష ఫెయిల్

డోప్ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారత అథ్లెట్ దీక్ష ఫెయిల్

ఢిల్లీ: మహిళల 1500 మీటర్ల జాతీయ రికార్డు హోల్డర్ కేఎమ్ దీక్ష డోప్ టెస్ట్‌‌‌‌‌‌‌‌లో విఫలమైంది. జైపూర్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు పరీక్షల్లో తేలింది. నిబంధనల ప్రకారం ఫెడరేషన్ కప్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనకపోవడంతో ఆమె ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్ ఎంపికకు దూరమైంది. 

మే 2024లో అమెరికాలో 4:04.78 సెకన్లతో జాతీయ రికార్డును సాధించింది. మరోవైపు అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) విడుదల చేసిన సస్పెండైన అథ్లెట్ల జాబితాలో భారత్ 154 మందితో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ డోపింగ్ ఉల్లంఘనల జాబితాలో కెన్యా (147), రష్యా (65) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.