ఆసియా వాలీబాల్‌‌‌‌‌‌‌‌లో ఇండియా కుర్రాళ్ల చరిత్ర

ఆసియా వాలీబాల్‌‌‌‌‌‌‌‌లో ఇండియా కుర్రాళ్ల చరిత్ర

బ్యాంకాక్: ఆసియా మెన్స్ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–16 వాలీబాల్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో యంగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో పాల్గొన్న తొలిసారే కాంస్య పతకం కైవసం చేసుకుంది. దాంతోపాటు అండర్ 17 వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ బెర్తు కూడా అందుకుంది. సెమీఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిన ఇండియా శనివారం జరిగిన  కాంస్య పతక పోరులో 3–-2 (25–-21, 12–-25, 25–-23, 18-–25, 15–-10) తేడాతో జపాన్‌‌‌‌‌‌‌‌పై ఉత్కంఠ విజయంతో పతకం సాధించింది. 

దాంతో పాటు గ్రూప్ దశలో జపాన్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇండియా ప్లేయర్లలో అబ్దుల్లా (16 పాయింట్లు), అప్రతిమ్ (15), రఫీక్ (12), చరణ్ (4) అద్భుతంగా రాణించి జట్టును గెలిపించారు. ఈ టోర్నీలో పూల్-–ఎలో పోటీపడిన ఇండియా ఆరంభం నుంచే సత్తా చాటింది. ఆతిథ్య థాయిలాండ్, ఆస్ట్రేలియా, చైనా జట్లను వరుస సెట్లలో ఓడించి ఏకంగా తొమ్మిది పాయింట్లు సాధించింది. 

ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌ను కూడా ఓడించి గోల్డ్ మెడల్‌‌‌‌‌‌‌‌పై ఆశలు రేపింది. కానీ,  గ్రూప్ దశలో జపాన్ చేతిలో ఓటమి వల్ల ఫైనల్‌‌‌‌‌‌‌‌కు కాకుండా.. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో సెమీఫైనల్లో తలపడాల్సి వచ్చింది. ఇక ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన ఇండియాతో పాటు పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌, జపాన్‌‌‌‌‌‌‌‌, ఇరాన్‌‌‌‌‌‌‌‌  2026లో ఖతార్‌‌‌‌‌‌‌‌లో జరిగే అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌17 వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అయ్యాయి.  

మరిన్ని వార్తలు