రష్యాతో మన వ్యాపారాలకు ఇబ్బందుల్లేవ్

రష్యాతో మన వ్యాపారాలకు ఇబ్బందుల్లేవ్
  • ఇంకా ఎటువంటి ఆంక్షలు పెట్టని ప్రభుత్వం, ఆర్‌‌బీఐ
  • రష్యన్ బ్యాంకులతో మన బ్యాంకుల డీలింగ్స్ మామూలుగానే

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: ప్రస్తుతానికైతే రష్యాతో చేసే వ్యాపార లావాదేవీలపై  దేశంలోని బిజినెస్‌‌‌‌లకు పెద్దగా ఇబ్బందులు తలెత్తడం లేదు.  రష్యన్ బ్యాంకులతో ఎటువంటి ట్రాన్సాక్షన్లు చేయొద్దని మన బ్యాంకులకు ప్రభుత్వం, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐలు  ఇంకా ఆదేశాలు ఇవ్వలేదు.  ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా దాడిని ఖండిస్తూ యూఎస్, యురోపియన్‌‌‌‌, జపాన్‌‌‌‌, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల సెంట్రల్ బ్యాంకులు సొసైటీ ఫర్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌ ఇంటర్‌‌‌‌‌‌‌‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ (స్విఫ్ట్) సిస్టమ్‌‌‌‌ను వాడడంతో రష్యన్ బ్యాంకులను నియంత్రించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా  రష్యన్ సెంట్రల్ బ్యాంక్‌‌‌‌ తన విదేశీ మారక నిల్వలను వాడడంపై కూడా నియంత్రణలు విధించారు. ఈ నియంత్రణల ప్రభావం రష్యా–ఇండియా మధ్య జరిగే లావాదేవీలపై పెద్దగా ఉండదని ఎనలిస్టులు చెబుతున్నారు.  రష్యాతో జరిగే ట్రేడ్‌‌‌‌లపై నియంత్రణలు పెట్టే స్టేజ్‌‌‌‌కు ఇండియా వెళ్లకపోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌‌‌‌లో ఇండియాకు అనుకూలంగా  ఉక్రెయిన్‌‌‌‌  ఓటు వేయకపోయిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. వ్యాపార లావాదేవీల పరంగా ఇండియాకు రష్యాకు  మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో రష్యాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడానికి  ప్రభుత్వం ఆలోచిస్తోంది.  ‘ రష్యాలో మన  బ్యాంకులు కేవలం కొన్నే ఉన్నప్పటికీ, దేశంలోని  చాలా బ్యాంకులు రష్యన్ బ్యాంకులతో కరస్పాండెంట్ బ్యాంకింగ్‌‌‌‌ రిలేషన్స్‌‌‌‌ను కొనసాగిస్తున్నాయి. ఈ విధానంలో ఇరు దేశాల మధ్య ట్రాన్సాక్షన్లు భారీగా జరుగుతున్నాయి. యూఎస్ ఆంక్షల వలన ఈ విధానంపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు’ అని కూడా నిపుణులు చెబుతున్నారు. 

రష్యా సెంట్రల్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌పై మరిన్ని ఆంక్షలు..

యూఎస్‌‌‌‌, మరికొన్ని దేశాలు రష్యాపై విధించే ఆంక్షలు కొన్ని బ్యాంకులకు మాత్రమే పరిమితమయ్యేటట్టు కనిపిస్తున్నాయి. స్విఫ్ట్‌‌‌‌ను ఏయే రష్యన్ బ్యాంకులు వాడకూడదనే లిస్టు ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం రష్యాలో స్బెర్‌‌‌‌‌‌‌‌బ్యాంక్ అతిపెద్దది. యూఎస్‌‌‌‌ ఆంక్షల లిస్టులో ఈ బ్యాంకు ఉంటే మాత్రమే రష్యా ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  రష్యాలోని రెండో అతిపెద్ద బ్యాంక్ వీటీబీపై కూడా యూఎస్ ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. మరోవైపు రష్యా కరెన్సీ రూబుల్‌‌‌‌కు సపోర్ట్ ఇవ్వడానికి అదనంగా ఫారెక్స్ నిల్వలను ఆ దేశ ప్రభుత్వం సేకరిస్తోంది. దీన్ని నియంత్రించడానికి అదనంగా మరిన్ని ఆంక్షలను పెడతామని యూకే ట్రెజరీ డిపార్ట్‌‌‌‌మెంట్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌‌‌‌లు ప్రకటించాయి.

రష్యన్ కరెన్సీ పతనం..

స్విఫ్ట్ గ్లోబల్‌‌‌‌ పేమెంట్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ను రష్యన్‌‌‌‌ బ్యాంకులు వాడడాన్ని నియంత్రించడంతో ఆ దేశ కరెన్సీ రూబుల్ డాలర్ మారకంలో సోమవారం భారీగా క్రాష్ అయ్యింది. సోమవారం ఒక్క సెషన్‌‌‌‌లోనే డాలర్ మారకంలో రూబుల్ విలువ 26 % తగ్గింది. దీంతో ఒక డాలర్ విలువ 84 రూబుల్ నుంచి 105.27 రూబుల్‌‌‌‌కు పడింది.  అంతేకాకుండా మొత్తం 600 బిలియన్ డాలర్ల విలువైన ఫారిన్ కరెన్సీని వాడకుండా ఉండేలా యూఎస్, మిత్ర దేశాలు ఆంక్షలు పెట్టాయి. దీంత డాలర్ మారకంలో రష్యన్ కరెన్సీ భారీగా పడింది. వెస్ట్రన్ కంట్రీస్ నియంత్రణలు ఎదుర్కొనేందుకు రష్యా గవర్నమెంట్  కీలక రేట్లను ప్రస్తుతం ఉన్న 9.5 % నుంచి 20 శాతానికి పెంచింది. దీంతో రూబుల్‌‌‌‌పై ప్రెజర్‌‌‌‌‌‌‌‌ పడుతోంది. దీంతో రష్యాలో రూబుల్ వాల్యూ పడిపోవడంతో పాటు, ఇన్‌‌‌‌ఫ్లేషన్ పెరుగుతోంది.