గూగుల్‌తో మన కంపెనీల  హోరాహోరీ పోరు  

గూగుల్‌తో మన కంపెనీల  హోరాహోరీ పోరు  

గూగుల్ x ఇండియన్ యాప్ ల మధ్య ముదురుతున్న గొడవ

ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్న స్టార్టప్‌‌‌‌లు

ప్లే స్టోర్‌‌‌‌‌‌‌‌ పాలసీలపై అభ్యంతరం

సొంతంగా ఓ యాప్‌‌‌‌ స్టోర్‌‌‌‌‌‌‌‌ తేవాలనుకుంటున్న యాప్‌‌‌‌ డెవలపర్లు

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: టెక్‌‌‌‌ కంపెనీ గూగుల్‌‌‌‌కు, ఇండియన్‌‌‌‌ యాప్‌‌‌‌లకు మధ్య గొడవ ముదురుతోంది. ప్లేస్టోర్‌‌‌‌‌‌‌‌కు ప్రత్యామ్నాయ మార్గాలను ఇండియన్‌‌‌‌ యాప్‌‌‌‌లు వెతుకుతున్నాయి. దీంతో దేశంలో తమ పాలసీలను గూగుల్‌‌‌‌ సరళీకరించే అవకాశం కనిపిస్తోంది. కాగా, గూగుల్‌‌‌‌ ప్లే బిల్లింగ్‌‌‌‌, ప్లేస్టోర్‌‌‌‌‌‌‌‌ పాలసీలపై  గత కొంత కాలం నుంచి స్టార్టప్‌‌‌‌లు, యాప్‌‌‌‌ డెవలపర్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.  ఇప్పటికే చాలా వరకు స్టార్టప్‌‌‌‌ కంపెనీలు తమ యాప్‌‌‌‌ను ప్లేస్టోర్లలో కాకుండా  ఆండ్రాయిడ్‌‌‌‌ అప్లికేషన్ ప్యాకేజి(ఏపీకే) మోడ్‌‌‌‌లో  తమ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లలోనే అందుబాటులో ఉంచుతున్నాయి. ఉదాహరణకు  డ్రీమ్‌‌‌‌11 యాప్‌‌‌‌ గూగుల్‌‌‌‌ ప్లేస్టోర్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో లేదు. కానీ కంపెనీ యాప్‌‌‌‌ ఇప్పటికే 10 కోట్ల డౌన్‌‌‌‌లోడ్లను దాటిందని అంచనా. ఆపరేటింగ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌(ఆండ్రాయిడ్‌‌‌‌) నుంచి యాప్‌‌‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌ వరకు మొత్తం టెక్నాలజీ సెక్టార్‌‌‌‌‌‌‌‌ని కంట్రోల్‌‌‌‌ చేస్తున్న గూగుల్‌‌‌‌,  తగిన రీతిలో నడుచుకోవాలని స్టార్టప్‌‌‌‌లు డిమాండ్‌‌‌‌ చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ కంపెనీలన్ని కలిసి ఒక యాప్‌‌‌‌ స్టోర్‌‌‌‌‌‌‌‌ను తేవాలని చూస్తున్నాయి.

యాప్‌‌‌‌ డెవలపర్లతో సమావేశమవుతున్న గూగుల్‌‌‌‌..

యాప్‌‌‌‌ డెవలపర్ల ఆందోళనలను మరింతగా తెలుసుకునేందుకు వేరు వేరు యాప్‌‌‌‌ డెవలపర్లతో గూగుల్‌‌‌‌ సమావేశమవుతోంది. దీంతో పాటు పాలసీ వర్క్‌‌‌‌షాప్స్‌‌‌‌ను నిర్వహించి  కంపెనీ పాలసీలకు సంబంధించి యాప్‌‌‌‌ డెవలపర్లకు సమాధానం ఇవ్వాలని చూస్తోంది. వీటితో పాటు ఇండియన్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌లు ప్లేస్టోర్‌‌‌‌‌‌‌‌ బిల్లింగ్ రూల్స్‌‌‌‌ను ఫాలో అయ్యేందుకు అదనంగా ఆరు నెలలు టైమ్ ఇవ్వాలని గూగుల్‌‌‌‌ నిర్ణయించుకుంది.  కాగా, బిల్లింగ్‌‌‌‌ రూల్స్ ప్రకారం ప్లేస్టోర్‌‌‌‌‌‌‌‌ ద్వారా డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకున్న యాప్‌‌‌‌లో యాప్ పర్చేజింగ్‌‌‌‌ జరిగితే ..ఆ అమౌంట్‌‌‌‌లో 30 శాతాన్ని గూగుల్‌‌‌‌కు కమీషన్‌‌‌‌గా కట్టాల్సి ఉంటుంది. మిగిలిన అమౌంట్‌‌‌‌ మాత్రమే యాప్‌‌‌‌ డెవలపర్లకు చేరుతుంది. గూగుల్‌‌‌‌ ప్లేస్టోర్‌‌‌‌‌‌‌‌ కమీషన్ డిమాండ్‌‌‌‌, పబ్లిక్ పాలసీ, రెగ్యులేషన్‌‌‌‌ వంటి విషయాలలో ఇండియన్‌‌‌‌ యాప్స్‌‌‌‌ అసంతృప్తిగా ఉన్నాయని ఎనలిస్టులు అంటున్నారు. దీంతో  గూగుల్ వెనక్కి తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. కాగా పేటీఎం ఫౌండర్‌‌‌‌‌‌‌‌ విజయ్‌‌‌‌ శేఖర్‌‌‌‌‌‌‌‌ శర్మతో కలిపి మొత్తం 24 స్టార్టప్‌‌‌‌ ఫౌండర్లు  గూగుల్‌‌‌‌ పాలసీలకు వ్యతిరేకంగా ఎలక్ట్రానిక్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌ టెక్నాలజి మినిస్ట్రీకి ఫిర్యాదు చేశాయి.

ప్లే స్టోర్లో ఒకలా..యూట్యూబ్‌‌‌‌లో మరొకలా

గూగుల్‌‌‌‌ పాలసీలు ఒక్కోచోట ఒక్కో రకంగా ఉన్నాయని పేటీఎం బుధవారం ఆరోపించింది. గూగుల్‌‌‌‌ ప్లేస్టోర్‌‌‌‌‌‌‌‌లో  పేటీఎం ఫస్ట్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ తిరిగొచ్చిందని ప్రకటిస్తూనే..రియల్‌‌‌‌ మనీతో ఆడే తమ ప్రో యాప్‌‌‌‌ను ప్రమోట్‌‌‌‌ చేయడానికి ప్లేస్టోర్‌‌‌‌‌‌‌‌ అనుమతించలేదని పేర్కొంది. కానీ యాడ్స్ కోసం డబ్బులు ఖర్చు చేస్తే ఈ యాప్‌‌‌‌ను  యూట్యూబ్‌‌‌‌లో ప్రమోట్‌‌‌‌ చేసుకోవడానికి గూగుల్‌‌‌‌ అనుమతిస్తోందని తెలిపింది. దీనికి ఎటువంటి పాలసీలు అడ్డురావడం లేదని ఆరోపించింది. కాగా ప్రస్తుతం ప్లేస్టోర్‌‌‌‌‌‌‌‌లో పేటీఎం ఫస్ట్ గేమ్‌‌‌‌ ఫ్రీ యాప్‌‌‌‌ అందుబాటులో ఉంది. ఈ యాప్‌‌‌‌ ద్వారా రియల్‌‌‌‌ మనీతో ఫ్యాంటసీ గేమింగ్‌‌‌‌ ఆడడానికి వీలుండదు. పేటీఎం ఫస్ట్ గేమ్‌‌‌‌ ప్రో యాప్ కావాలనుకుంటే కంపెనీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లోకి వెళ్లి డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకోవచ్చు.  ‘కంపెనీ ప్రో యాప్‌‌‌‌ను ప్లేస్టోర్‌‌‌‌‌‌‌‌ ద్వారా ప్రమోట్‌‌‌‌ చేయాలనుకుంటే  అది పాలసీలకు విరుద్ధమని గూగుల్‌‌‌‌ చెబుతోంది. కానీ, ఇదే యాప్‌‌‌‌ను యూట్యూబ్‌‌‌‌లో యాడ్స్‌‌‌‌ కింద ప్రమోట్‌‌‌‌ చేసుకోవడానికి గూగుల్‌‌‌‌కు ఎటువంటి పాలసీలు అడ్డురావడం లేదు’ అని పేటీఎం తన బ్లాగ్‌‌‌‌లో పేర్కొంది. పేటీఎం ఫస్ట్‌‌‌‌ గేమ్‌‌‌‌లో వివిధ ఫ్యాంటసీ గేమింగ్‌‌‌‌ యాప్స్ ఉంటాయి. కస్టమర్లు తమకు నచ్చిన గేమ్‌‌‌‌ను ఆడుకోవచ్చు. ప్లేస్టోర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న పేటీఎం ఫస్ట్ గేమ్‌‌‌‌ ఫ్రీ యాప్‌‌‌‌లో రియల్ మనీతో గేమింగ్‌‌‌‌ ఆడడానికి వీలుండదు. ఈ యాప్‌‌‌‌లో డబ్బులు యాడ్‌‌‌‌ చేయడానికి, విత్‌‌‌‌ డ్రా చేయడానికి కుదరదు. కాగా సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 18 న పేటీఎం యాప్‌‌‌‌ను ప్లేస్టోర్‌‌‌‌‌‌‌‌ నుంచి గూగుల్ తొలగించిన విషయం తెలిసిందే. తర్వాత కంపెనీ తిరిగి ప్లేస్టోర్‌‌‌‌‌‌‌‌కు రాగలిగింది. గూగుల్‌‌‌‌ ప్లే బిల్లింగ్‌‌‌‌ పాలసీలను ఇండియన్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌లు ఫాలో అయ్యేందుకు వచ్చే ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 30 వరకు గూగుల్‌‌‌‌ టైమిచ్చింది కూడా. ఈ విధానాలను ఇండియన్ స్టార్టప్‌‌‌‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.