Microsoft Pakistan:పాకిస్తాన్కు మైక్రోసాఫ్ట్ గుడ్బై..25 ఏళ్ల తర్వాత కార్యకలాపాల మూసివేత

Microsoft Pakistan:పాకిస్తాన్కు మైక్రోసాఫ్ట్ గుడ్బై..25 ఏళ్ల తర్వాత కార్యకలాపాల మూసివేత

ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ కు షాకిచ్చింది..ఎటువంటి సమాచారం లేకుండానే పాకిస్తాన్ లోని మైక్రోసాఫ్ట్ సంస్థను మూసివేసింది. 2000 లో పాకిస్తాన్ లో తన బ్రాంచ్ ని ఏర్పాటు చేసిన మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా తన కార్యకలాపాలను ఆ రీజియన్ నుంచి ముగిస్తున్నట్లు గురువారం(జూన్ 3న) ప్రకటించింది. కంపెనీ అధికారికంగా అధికారిక ప్రకటన కూడా చేయకుండానే ఈ ప్రాంతం నుండి నిష్క్రమించింది. పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధిపతి జావాద్ రెహ్మాన్ ఈ వార్తను ఒక శకం ముగింపు అంటూ పోస్ట్ షేర్ చేశారు.పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఆర్థిక గందరగోళం, రాజకీయమే కారణమా.. 

మైక్రోసాఫ్ట్ సంస్థ పాకిస్తాన్ తన యాక్టివిటీస్ ముగించేందుకు కారణాలను బహిరంగా ప్రకటించనప్పటికీ అది ఆవిషయం ఓపెన్ గానే ఉంది. పాకిస్తాన్ అస్థిర ఆర్థిక వ్యవస్థ, అస్థిర రాజకీయాలు, విఫలమైన వ్యాపార విధానాలు కారణంగా మైక్రోసాఫ్ట్ సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

2024 ఆర్థిక సంవత్సరం లో పాకిస్తాన్ వాణిజ్య లోటు 24.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. జూన్ 2025లో నిల్వలు కేవలం 11.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇది టెక్ దిగుమతులు ,విదేశీ పెట్టుబడులను తీవ్రంగా ప్రభావితం చేసింది.మల్టీనేషన్ నేషనల్ కంపెనీలను కొనసాగించేదుకు అవసరమైన రాజకీయ ,ఆర్థిక పరిస్థితులు లేకపోవడం ప్రధాన ఆందోళనగా కనిపిస్తోంది.  మైక్రోసాఫ్ట్ నిధులు ,సాధనాలను స్వేచ్ఛగా లోపలికి ,బయటికి తరలించలేకపోవడం మరొక ఆందోళనగా మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. 

భారతదేశం-పాకిస్తాన్ వాణిజ్య ఉద్రిక్తతలు

భారత్ తో పాకిస్తాన్  ద్వైపాక్షిక వాణిజ్యం బాగా క్షీణించింది. ముఖ్యంగా పహల్గాం అటాక్ తర్వాత ఇది మరింత క్షీణించింది. 2018లో రెండు దేశాల మధ్య 3 బిలియన్ డాలర్ల వాణిజ్యం  జరగ్గా.. 2024లో కేవలం 1.2 బిలియన్ల డాలర్ల కు చేరుకుంది.  మెడిసిన్స్ కీలకమైన దిగుమతులను ఇప్పుడు థర్డ్ పార్టీ దేశాలకు మళ్లించడంతో ఆలస్యంతోపాటు ఖర్చులు పెరిగాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత పాకిస్తాన్‌లో పెట్టుబడి వాతావరణాన్ని మరింత దిగజార్చింది.

►ALSO READ | Microsoft Layoffs: 25 ఏళ్ల సర్వీస్ తర్వాత.. మైక్రోసాఫ్ట్ మేనేజర్ తొలగింపు..సోషల్ మీడియాలో పెద్ద చర్చ

2022 తర్వాత  మైక్రోసాఫ్ట్ తన వ్యాపారాన్ని పాకిస్తాన్ లో విస్తరించాలని యోచించింది. అయితే పాకిస్తాన్ లో పెరుగుతున్న  అస్థిరత కంపెనీనీ వియత్నాం వైపు మొగ్గుచూపేలా చేసింది. రెండేళ్లుగా పాకిస్తాన్ లో తన వ్యాపార మద్దతును తగ్గించింది. ఇప్పుడు  కొత్త భాగస్వామ్యాలను నిలిపివేయడం ద్వారా పూర్తిగా మైక్రోసాఫ్ట్  పాకిస్తాన్ రీజియన్ సంస్థను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.