
25 యేళ్ల అనుభవం..సీనియర్ మేనజర్ గా సర్వీస్..అయినా లేఆఫ్ లెటర్ తప్పలేదు.ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఇటీవల ప్రకటించిన ఉద్యోగుల తొలగింపు జాబితా ఈ సీనియర్ మేనేజర్ పేరుకూడా ఉంది..లెటర్ అందుకున్న సీనియర్ మేనేజర్ ఊహించని పరిమాణం షాక్ అయ్యాడు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు..ఇప్పుడు ఇదే సోషల్ మీడియా హాట్ టాపిక్..
జూలై 2న మైక్రోసాఫ్ట్ వేర్ కంపెనీ వివిధ డిపార్టుమెంట్లనుంచి దాదాపు 9వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న ప్రకటించింది. ఈక్రమంలో ఆ సంస్థ సీనియర్ మేనేజర్ అయిన క్రిస్ బైమమ్ తాను ఉద్యోగాన్ని కోల్పోతున్నట్లు అందిన మైక్రోసాఫ్ట్ లేఆఫ్ లెటర్ లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. క్రిస్ బైమమ్ కు సోషల్ మీడియాలో సపోర్టు చేస్తూ కామెంట్లు పెట్టారు.
కస్టమర్ సక్సెస్ అకౌంట్ మేనేజర్ గా 25 యేళ్ల అనుభవం ఉన్న క్రిస్ బైమమ్.. తన ఉద్యోగాన్ని కోల్పోవడం అనే చేదు జ్ణాపకాన్ని, ఆశ్చర్యాన్ని, విషాదాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ లింక్డ్ ఇన్ లో షేర్ చేశారు. దీంతో నెటిజన్లు భారీ ఎత్తున స్పందించారు. క్రిస్ బైమమ్ కు సపోర్టుగా పోస్టులు పెట్టారు.
మైక్రోసాఫ్ట్ తొలగింపులు
దాదాపు 9వేలమంది ఇతర ఉద్యోగులతో పాటు క్రిస్ కూడా అదే సమయంలో తొలగించారు. గడిచిన రెండేళ్లలో మైక్రోసాఫ్ట్ తొలగించిన ఉద్యోగుల సంఖ్యలు ఇదే అత్యధికం. 2025 ప్రారంభంలో లేఆఫ్స్ తర్వాత మేల 6వేలు, జూన్ లో 300 ఉద్యోగుల తొలగించారు.
►ALSO READ | మన స్టాక్ మార్కెట్లో రూ.43వేల కోట్ల కుంభకోణం జరిగింది ఇలానే.. ఈ డబ్బంతా ఎవరి దగ్గర కొట్టేశారు!
గేమింగ్ నుంచి అమ్మకాల వరకు అన్ని విభాగాల్లో తొలగింపులు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం రెడ్ మండ్ నుంచి కూడా 4శాతం ఉద్యోగులను తొలగించినట్లు మైక్రోసాఫ్ ప్రకటించింది.