టోక్యో పారాలింపిక్స్ కు బయల్దేరిన భారత అథ్లెట్స్

V6 Velugu Posted on Aug 18, 2021

టోక్యో పారాలింపిక్స్ కు భారత అథ్లెట్స్ బయలు దేరారు. పారాలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ దీపా మాలిక్ ఆధ్వర్యంలో పారా అథ్లెట్స్ ఢిల్లీ నుంచి టోక్యో బయలు దేరారు. ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు టోక్యోలో పారాలింపిక్స్ జరగనున్నాయి. భారత్ నుంచి 54 మంది పారా అథ్లెట్స్ పాల్గొంటున్నారు. ఈసారి తాను ఆడడంలేదని... పారాలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా వారితో కలసి పనిచేయడం కొత్త ఫీల్ ఇస్తోందని దీపా మాలిక్ చెప్పారు. వీలైనన్ని మెడల్స్ గెలవడమే లక్ష్యంగా తాము టోక్యో వెళ్తున్నామి డిస్కస్ త్రోయర్ వినోద్ కుమార్ చెప్పారు. శక్తిమేరకు ఆడి పతకాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తామని జావెలిన్ త్రోయర్ టేక్ చందు చెప్పారు. 

 

Tagged airport, Tokyo 2020, Indian contingent arrive, departure, paralympics

Latest Videos

Subscribe Now

More News