ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో– ఆపరేటివ్ (ఇఫ్కో) అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
ఖాళీలు: అప్రెంటీస్ ట్రైనీలు.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ట్రేడ్‌లో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, కనీసం 55 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్/ బయాలజీ సబ్జెక్టులతో బీఎస్సీ. కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జనవరి 29.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు iffco.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
