2026 ఆస్కార్ నామినేషన్స్.. ఇండియన్ సినిమాకు నిరాశ

2026 ఆస్కార్  నామినేషన్స్.. ఇండియన్ సినిమాకు నిరాశ

సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరి కల ఆస్కార్. ప్రస్తుతం 98వ అకాడమీ అవార్డుల  వేడుకకు అంతా సిద్ధమవుతోంది.  ఈ సందర్భంగా గురువారం ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2026 జాబితాను ప్రకటించింది అకాడమీ. ఈ జాబితాలోని మొత్తం 24 కేటగిరీల్లో    ‘సిన్నర్స్’ చిత్రం 16,  ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ 12  కేటగిరీల్లో   నామినేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొంది  రికార్డు క్రియేట్ చేశాయి.  మార్చి 15న  అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. 

‘సిన్నర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ జోరు

ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఘన విజయం సాధించిన పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వంలోని ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రంతోపాటు  రియన్ కుగ్లర్ తెరకెక్కించిన ‘సిన్నర్స్’ మూవీ  కూడా పలు ప్రధాన విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుని బలమైన పోటీగా నిలిచింది.  ఇప్పటివరకూ 14 నామినేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘ఆల్ ఆబౌట్ ఈవ్’కు రికార్డ్ ఉండగా తాజాగా ‘సిన్నర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ 16  కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.  ఇక  భారీ అంచనాల మధ్య గతేడాది విడుదలైన  ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’ చిత్రం  కాస్ట్యూమ్ డిజైన్,  విజువల్ ఎఫెక్ట్స్ లాంటి రెండు  కేటరిగీలకు మాత్రమే  నామినేషన్ సాధించింది. 

ఇండియన్ సినిమాకు నిరాశ 

ఈసారి భారతీయ చిత్రాలేవీ ఆస్కార్ నామినేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేకపోవడం కొంత నిరాశ కలిగించింది.  మన దేశం నుండి అధికార ఎంట్రీగా ‘ఉత్తమ అంతర్జాతీయ చిత్రం’  కేటగిరీలో   పోటీపడ్డ ‘హోమ్ బౌండ్’ కు నిరాశ ఎదురైంది. ఇండియన్ మూవీ తరఫున దీనికి నామినీలలో కచ్చితంగా  చోటు దక్కుతుందని చాలామంది ఆశించారు, కానీ చివరికి అది జరగలేదు.  నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించగా ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందాయి. అలాగే  ఈ ఏడాది ఆస్కార్ జనరల్ ఎంట్రీ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  మహావతార్ నరసింహ, కాంతార చాప్టర్ 1, తన్వి ది గ్రేట్, టూరిస్ట్ ఫ్యామిలీ, సిస్టర్ మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ చిత్రాలు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో  చోటు దక్కించుకోగా ఏ ఒక్క చిత్రానికి నామినేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్థానం దక్కకపోవడం ఇండియన్ మూవీ లవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీవ్ర నిరాశను కలిగించింది.
    

ఉత్తమ చిత్రం : 

బగోనియా, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1, ఫ్రాంకిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టయిన్, హ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెట్, మార్టీ సుప్రీమ్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్,  ద సీక్రెట్ ఏజెంట్, సెంటిమెంటల్ వాల్యూ, సిన్నర్స్,  ట్రైన్ డ్రీమ్స్.
ఉత్తమ నటుడు:
తిమోతి చాలమేట్ ( మార్టీ సుప్రీమ్), లియోనార్డ్ డికాప్రియో  (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్),  ఈథన్ హాక్  (బ్లూ మూన్),  మైఖేల్ బి జోర్డాన్ ( సిన్నర్స్), వాగ్నర్ మౌరా ( ది సీక్రెట్ ఏజెంట్).
ఉత్తమ నటి: 
జస్సీ బక్లీ (హ్యామ్ నెట్), రోజ్ బర్న్ (ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ వుడ్ కిక్ యు), కేట్ హడ్సన్ (సాంగ్ సంగ్ బ్లూ), రెనాటా రైన్సావా ( సెంటిమెంటల్ వాల్యూ), ఎమ్మాస్టోన్ (బగోనియా). 
ఉత్తమ దర్శకుడు: 
క్లోయి జావ్ (హ్యామ్ నెట్), జాష్ షాఫ్డీ  (మార్టీ సుప్రీమ్),  పాల్ థామస్ ఆండ్రూసన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్), యోఆకీమ్ ట్రియర్ (సెంటిమెంటల్ వాల్యూ), రేయాన్ కూగ్లర్  (సిన్నర్స్).
ఉత్తమ సహాయ నటుడు: 
బెనిసియో డెల్ టారో (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్), జేకబ్ ఎల్రోడి (ఫ్రాంకిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టన్), డెల్రాయ్ లిండో (సిన్నర్స్), షాన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్), స్టెలెన్ స్కార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గార్డ్ (సెంటిమెంటల్ వాల్యూ). 

ఉత్తమ సహాయ నటి: 

ఎల్ ఫ్యానింగ్  (సెంటిమెంటల్ వాల్యూ),  ఇంగా ఇబ్సిడాట్టర్ లిల్లాస్  (సెంటిమెంటల్ వాల్యూ),  ఎమీ మాడిగన్  (వెపన్స్), ఉన్మి మసాకు ( సిన్నర్స్), టియానా టేలర్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్). 

వీటితోపాటు  అడాప్టెటెడ్ స్ర్కీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే, ఒరిజినల్ స్ర్కీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్,  కాస్ట్యూమ్ డిజైన్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్,  మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, ఒరిజినల్ స్కోర్, యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్, సినిమాటోగ్రఫీ, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్,  ఎడిటింగ్, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, ఒరిజినల్ సాంగ్, సౌండ్, ప్రొడక్షన్ డిజైనింగ్, విజువల్ ఎఫెక్ట్స్,  అచీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ క్యాస్టింగ్ లాంటి కేటగిరీల్లో నామినేట్ అయిన చిత్రాలను ప్రకటించారు.